మిళసినిమా: బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో తరువాత నటి ఓవియకు వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. తను ఆ షో నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ గేమ్ షో రేటింగ్ పడిపోయిందనే ప్రచారం జరుగుతుందటే ఓవియ ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు నటిగానూ ఇంతకు ముందు కంటే ఓవియ క్రేజ్ పెరిగింది. తాజాగా తన నటుడు పృథ్వీరాజ్‌కు జంటగా నటించిన పోలీస్‌రాజ్యం చిత్రానికి వ్యాపారపరంగా ఊపు వచ్చింది.
అన్నపూరిణి ఫిలింస్ పతాకంపై అరుణాచలం నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను బాబూరాజ్ నిర్వహించారు. జెమినికిరణ్, కళాభవన్‌మణి, సత్య, ఐశ్వర్య, జగదీశ్, సీమ, దేవ ముఖ్య పాత్రలను పోషించిన ఇందులో దర్శకుడు బాబూరాజ్ ప్రధాన పాత్ర పోషించారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఒక గ్రామంలో అమ్మనాన్న, పిల్లలు అంటూ హాయిగా జీవిస్తున్న ఒక కుటుంబంలో వరుసగా హత్యలు జరుగుతాయన్నారు.
ఆ గ్రామంలోనే అసాంఘిక సంఘటనలు చోటు చేసుకుని స్థానిక పోలీసులకే అంత చిక్కని పరిస్థితుల్లో నటుడు పృధ్వీరాజ్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా వస్తారన్నారు. ఆయన తన ఇన్వెస్టిగేషన్‌లో హంతకుడెరన్నది కనుగొని అరెస్ట్ చేయగా, కొన్ని దిగ్బ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూస్తాయన్నారు. అవి ఏమిటన్నదే పోలీస్ రాజ్యం చిత్రంలో ఆసక్తికరమైన అంశాలని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నాయకిగా ఓవియ చాలా గ్లామరస్ పాత్రలో నటించిందని చెప్పారు.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 29వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. నటి ఓవియకున్న క్రేజ్‌ను దృష్టిలో పట్టుకుని పోలీస్‌రాజ్యాం చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా 250 థియేటర్లలో విడుదల చేయనున్నామని చెప్పారు. అదే విధంగా ఓవియ కోరిక మేరకు ఈ చిత్ర ప్రీమియర్‌ను మలేషియాలో ఏర్పాటు చేయనున్నట్లు, ఆ ప్రీమియర్ షోల్లో నటి ఓవియ పాల్గొననున్నట్లు తెలిపారు.
పోలీస్‌రాజ్యంలో ఓవియ
Published Fri, Sep 22 2017 4:28 AM | Last Updated on Tue, Aug 21 2018 7:34 PM
Advertisement
Advertisement