గీత రచయితతో ఓవియ | Tamil lyricist Thamarai's denial about Oviya | Sakshi

గీత రచయితతో ఓవియ

Oct 14 2017 5:26 AM | Updated on Oct 14 2017 5:26 AM

Tamil lyricist Thamarai's denial about Oviya

తమిళసినిమా: ప్రముఖ గీత రచయితతో రొమాన్స్‌ చేయడానికి నటి ఓవియ రెడీ అవుతోంది. ఒక మోస్తరు కథానాయకి ఓవియను బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో పెద్ద స్టార్‌ను చేసేసింది. ఇంతకు ముందు లేని మార్కెట్‌ ఒక్కసారిగా ఈ బ్యూటీ సొంతమైంది. ఇంకా చెప్పాలంటే దీపావళి వాణిజ్య ప్రకటనలో ఓవియనే ముందంజలో ఉంది. ఒక వస్త్ర దుకాణానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా అంగీకరించిన ఓవియ అందుకుగానూ ఏకంగా రూ.2 కోట్లు పారితోషికం అందుకుందనే ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

ఇక బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో నుంచి బయటకొచ్చిన తరువాత నటి ఓవియకు సినీ అవకాశాలు వరుస కడుతున్నాయి. వాటిలో తాజాగా ఒక చిత్రం చేరింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో కథానాయకుడిగా బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో చివరి వరకూ పాల్గొని మంచి పాపులారిటీ తెచ్చుకున్న ప్రముఖ గీత రచయిత స్నేహన్‌ నటించనున్నారు.ç మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్, తీయవేలై చేయనుమ్‌ కుమారు, నెడుంశాలై, ఇవన్‌వేరమాదిరి వంటి పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సి.సత్య నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని, త్వరలో పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement