Snehan
-
Joshi Anumuthu: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..!
మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే...ఆనందించే బాల్యం కాదు అతనిది. మెరుపు మెరిస్తే భయం... వానొస్తుందని, వాన కురిస్తే భయం... ఇంట్లో ఉండలేమని... ఎందుకంటే అది పేరుకే ఇల్లు. పేదవాడి ఇల్లు. ఇంటి పై కప్పుకు అన్నీ చిల్లులే! ఆకసమున హరివిల్లు సంగతి సరే... మరి తన ఆకలి సంగతి ఏమిటి? చదవండి: Mental Health: టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా బ్యాడ్ ఎఫెక్ట్..! ఎన్నో కష్టాలకు ఎదురీది పెద్ద చదువు చదువుకున్నాడు పుదుచ్చేరికి చెందిన అనుముతు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తయింది, ఆ తరువాత తనకు ఇష్టమైన ఫొటోగ్రఫీ కోర్స్ చేశాడు. సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది! అంతమాత్రాన నడిచొచ్చిన దారిని మరవలేదు. తాను ఎదుర్కొన్న కష్టాలు ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఎదుర్కొంటూనే ఉంటారు. వారికి అండగా నిలవాలనుకున్నాడు. కష్టాలు దాటి ముందుకు వెళ్లినవాడు కష్టపడుతున్న వారి కోసం వెనక్కి తిరిగి చూసుకున్నాడు. తల్లి కడుపుమాడ్చుకుని మరీ.. అనుమతు తండ్రి వడ్రంగి. తాను ఏడుసంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. ఇక కష్టాలు మొదలయ్యాయి. ‘మేమున్నాం’ అని ధైర్యం చెప్పే చుట్టాలు,పక్కాలు లేరు. తల్లీకొడుకులు కలిసి కూలీ పనులకు వెళ్లేవాళ్లు. కూలి ఉన్నరోజు తిండి. లేకపోతే పస్తులు. ఎప్పుడైనా ఇంట్లో ఒక్కరు తినడానికి మాత్రమే చాలినంత ఉంటే ‘నాకు ఆకలిగా లేదు. నువ్వు తిను నాయనా’ అనేది తల్లి! చదవండి: Fenty's Fortune: మీకేమైనా తెలుసా... వాట్స్ మై నేమ్? నా జీవితం స్థిరపడింది.. నాలాంటి వాళ్లకోసం.. ఎన్ని కష్టాలు పడుతున్నా బాగా చదువుకోవాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది అనుమతులో. ఇది గమనించిన ఒక పూజారి అనుమతును చదివించే బాధ్యతను తీసుకున్నాడు... అలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అనుమతు. ‘ఇక నా జీవితం స్థిరపడింది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు’ అనుకోలేదు. తనవంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశాడు. ఆ తరువాత తానే స్వయంగా ‘స్నేహన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. అందుకే ఆ సంస్థ ఏర్పాటు.. ఆటోరిక్షా నడిపే సురేష్‌కు చూపు దెబ్బతింది. కంటి ఆపరేషన్ చేసుకోవడం తప్పనిసరి. లేకపోతే ఆటో నడపలేడు. నడపకుంటే ఇల్లు గడవడం కష్టం. ఇలాంటి క్లిష్ట సమయంలో సురేష్‌కు కంటి ఆపరేషన్ చేయించి అతని జీవితం గాడిన పడడానికి సహాయపడ్డాడు. కొందరు యువకులతో ఒక బృందాన్ని తయారు చేశాడు. ఈ బృందంలోని సభ్యులు రైల్వేస్టేషన్, పార్క్, దేవాలయం, ఫ్లై ఓవర్ల దగ్గర ఆకలితో ఉన్న వ్యక్తులకు భోజనం, టీ, బిస్కెట్లు అందిస్తారు. వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చికిత్స చేయిస్తారు. వారికి ఉపాధి చూపి.. నగరంలో యాచన చేసే చాలామంది యాచకులతో అనుమతు మాట్లాడాడు. కొందరు గతం చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. తాము యాచించిన సొమ్మును రౌడీలు బెదిరించి తీసుకుంటున్నారని కొందరు ఫిర్యాదు చేశారు... ఇలా ఎంతకాలమని యాచిస్తారు? వీరికి ఏదైనా ఉపాధి చూడాలి అనుకున్నాడు అనుమతు. తిరువనంతపురంలోని కంతరి లీడర్షిప్ ప్రోగాంలో చేరి శిక్షణ తీసుకున్నాడు. ఈ శిక్షణ ఫలితంగా ఉపాధి అవకాశాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు అర్థం అయ్యాయి. ఫలితంగా 75 మందికి పైగా ఉపాధి మార్గాలు చూపించగలిగాడు. ఇలా.. సోషల్ సర్వీస్ కాటన్‌తో రకరకాల సంచుల తయారీ కోసం పేద మహిళలకు శిక్షణ ఇప్పించాడు. ఒకవైపు వీరికి ఉపాధి అవకాశం కలిపిస్తూనే, ‘స్నేహన్’ బ్రాండ్‌తో రూపొందించిన ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులు, ఫొటోగ్రఫీ ద్వారా వచ్చిన డబ్బును సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. ‘షెల్టర్‌హోమ్’ ఒకటి నిర్మించాలని, సేవాకార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు. చదవండి: బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఈ సమస్యలు పొంచి ఉన్నట్లే!! -
నటితో గీత రచయిత పెళ్లి, హాజరైన కమల్
Snehan Weds Kannika Ravi: మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ సమక్షంలో గీత రచయిత స్నేహన్ వివాహం గురువారం చెన్నైలో జరిగింది. స్నేహన్ మక్కల్ నీది మయ్యం పార్టీలో కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన, నటి కన్నిక రవి గురువారం అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగిన వీరి వివాహవేడుకకు కమల్ హాజరయ్యారు. కమల్ చేతుల మీదుగా తాళిని అందించగా స్నేహన్, కన్నిక రవి మెడలో మాంగల్యధారణ చేశారు. దర్శకుడు భారతీరాజా, జ్ఞానసంబంధం హాజరై నూతన దంపతులకు శుభాశీస్సులు అందించారు. Happy wedding day #Snehan sir #KamalHaasan #kamalhaasanfans pic.twitter.com/DYcDLaHIei — கமல் சரண் 🔦🔦🔦🔦🔦 (@sandiyarsaran7) July 29, 2021 Happy Married life #Snehan bro ❤️ pic.twitter.com/MmFKJsLIlN — karthik ™ OTFC (@karthik82515790) July 29, 2021 Kavingar #Snehan and #KannigaRavi Got Married Today. Congratulations pic.twitter.com/istVsnfCYU — Tamil Cinema Ulagam (Malaysia) (@ulagam_cinema) July 29, 2021 Actor #Snehan & #KannikaRavi married in the presence of #KamaHaasan today in Chennai. pic.twitter.com/J2cUcJpmbM — Manobala Vijayabalan (@ManobalaV) July 29, 2021 Lyricist #Snehan's marriage photo#KamalHaasan @ikamalhaasan @KavingarSnekan@offBharathiraja pic.twitter.com/f94yapX1bz — Aadhan Cinema (@AadhanCinema) July 29, 2021 Congratulations for your wedding 🎊💐💒 @KannikaRavi #Snehan pic.twitter.com/hXoZBDI17s — 🇮🇳ʀ ǟʀʊռӄʊʍǟʀ🇸🇬 (@arunr93) July 29, 2021 -
సినీ నటిని పెళ్లాడబోతున్న 'బిగ్‌బాస్' ఫేం స్నేహన్
చెన్నై: సినీ గీత రచయిత, నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ యువజన విభాగం కార్యదర్శి స్నేహన్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. 700 పైగా చిత్రాలకు 2,500కు పైగా పాటలను రాసిన రచయిత స్నేహన్. ప్రస్తుతం ఈయన మక్కల్ నీది మయ్యం పార్టీ యువజన విభాగ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నటి కన్నిక రవిని స్నేహన్ వివాహం చేసుకోబోతున్నారు. పెద్దల సమ్మతితో ఈ నెల 29న నటుడు కమలహాసన్ సమక్షంలో చెన్నైలో వివాహం చేసుకుంటు న్నారు. స్నేహన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుత పరిస్థితుల్లో నిరాడంబరంగా జరుపుకోవాలని భావించినట్లు తెలిపారు. -
గీత రచయితతో ఓవియ
తమిళసినిమా: ప్రముఖ గీత రచయితతో రొమాన్స్ చేయడానికి నటి ఓవియ రెడీ అవుతోంది. ఒక మోస్తరు కథానాయకి ఓవియను బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో పెద్ద స్టార్‌ను చేసేసింది. ఇంతకు ముందు లేని మార్కెట్ ఒక్కసారిగా ఈ బ్యూటీ సొంతమైంది. ఇంకా చెప్పాలంటే దీపావళి వాణిజ్య ప్రకటనలో ఓవియనే ముందంజలో ఉంది. ఒక వస్త్ర దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా అంగీకరించిన ఓవియ అందుకుగానూ ఏకంగా రూ.2 కోట్లు పారితోషికం అందుకుందనే ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. ఇక బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో నుంచి బయటకొచ్చిన తరువాత నటి ఓవియకు సినీ అవకాశాలు వరుస కడుతున్నాయి. వాటిలో తాజాగా ఒక చిత్రం చేరింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో కథానాయకుడిగా బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో చివరి వరకూ పాల్గొని మంచి పాపులారిటీ తెచ్చుకున్న ప్రముఖ గీత రచయిత స్నేహన్ నటించనున్నారు.ç మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని ఎంగేయుమ్ ఎప్పోదుమ్, తీయవేలై చేయనుమ్ కుమారు, నెడుంశాలై, ఇవన్‌వేరమాదిరి వంటి పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సి.సత్య నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని, త్వరలో పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. -
రీచార్జ్ అయిన ఇళయరాజా
సంగీతానికే రారాజుగా పేరు, ప్రఖ్యాతులు పొందిన ఇళయరాజా ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యూరు. గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన ఇళయరాజా ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగొచ్చారు. అనారోగ్యం కారణంగా మలేషియాలో నిర్వహించిన సంగీత కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడి అభిమానులను అలరించారు. నూతన సంవత్సరంలో ఇళయరాజా తన వృత్తి పరంగా రీచార్జ్ అయ్యారు. గీత రచయిత స్నేహన్ హీరోగా నటిస్తున్న రాజరాజ చోళనిన్ పోర్ వాల్ చిత్రం కోసం ఆయన నూతనోత్సాహంతో బాణీలందించారు. ఈ కార్యక్రమం ఆదివారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ థియేటర్లో జరిగింది. సోమవారం ఈ పాట రికార్డింగ్ జరిగింది. నూతన సంవత్సరంలో తొలిసారిగా ఇళయరాజా తన చిత్రానికి సంగీతాన్ని అందించడం సంతోషంగా భావిస్తున్నారు రాజరాజ చోళనిన్ పోర్వాల్ చిత్ర యూనిట్.