ఓవియ తొలి చిత్రానికి సీక్వెల్‌ | Kalavani 2 officially announced with Vemal and Oviya in leads | Sakshi
Sakshi News home page

ఓవియ తొలి చిత్రానికి సీక్వెల్‌

Published Sat, Feb 3 2018 4:00 AM | Last Updated on Sat, Feb 3 2018 4:00 AM

Kalavani 2 officially announced with Vemal and Oviya in leads - Sakshi

ఓవియ

తమిళసినిమా: నటి ఓవియను తమిళ ప్రేక్షకులకు దగ్గర చేసిన చిత్రం కలవాణి. విమల్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని సర్గుణం తెరకెక్కించారు. ఆయనకి దర్శకుడిగా ఇది మొదటి చిత్రమే. 2010లో విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని అందుకుంది. ముఖ్యం గా నటి ఓవియకు మరిన్ని అవకాశాలను తెచ్చి పెట్టిన చిత్రం కలవాణి. కాగా ఆ తరువాత ఓవియకు సరైన సక్సెస్‌లు పడలేదనే చెప్పా లి. అంతే కాదు అవకాశాలు రాలేదు. అయితే బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొన్న ఓవియను ఆ గేమ్‌ షో మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.

నటిగా అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, కథా నాయకుడిగా నటిస్తున్న కాంచన–3 చిత్రంలో ఓవియ కథా నాయకిగా నటిస్తోంది. ఇకపోతే సీక్వెల్స్‌ ట్రెండ్‌ నడుస్తున్న ఈ రోజుల్లో కలవాణి చిత్రానికి సీక్వెల్‌ తయారు అవుతోం ది. ఎనిమిదేళ్ల తరువాత కలవాణి–2 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అదే విమల్, ఓవియల జంట కలిసి నటిస్తున్నారు. కలవాణి చిత్ర దర్శకుడు సర్గుణం తన వర్ణన్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల మొదలైంది. ఇందులో నటించే ఇతర నటీనటులు, సంకేతిక వర్గాన్ని త్వరలో వెల్లడించనున్నట్లు దర్శక నిర్మాత సర్గుణం తెలిపారు. ఈ కలవాణి జంట మరోసారి మ్యాజిక్‌ చేస్తారా? అన్నది చూడాల్సిందే. ఇక ఈ చిత్ర టైటిల్‌ను గురువారం సాయంత్రం నటుడు శివకార్తికేయన్‌ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించడం విశేషం. ఇప్పటికే సర్గుణం మాధవన్‌ హీరోగా ఒక చిత్రం చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆయన సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నా రు. ఈ రెండు చిత్రాల షూటింగ్‌ మార్చిలో జరగనుందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement