kalavani
-
ఓవియ తొలి చిత్రానికి సీక్వెల్
తమిళసినిమా: నటి ఓవియను తమిళ ప్రేక్షకులకు దగ్గర చేసిన చిత్రం కలవాణి. విమల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని సర్గుణం తెరకెక్కించారు. ఆయనకి దర్శకుడిగా ఇది మొదటి చిత్రమే. 2010లో విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని అందుకుంది. ముఖ్యం గా నటి ఓవియకు మరిన్ని అవకాశాలను తెచ్చి పెట్టిన చిత్రం కలవాణి. కాగా ఆ తరువాత ఓవియకు సరైన సక్సెస్లు పడలేదనే చెప్పా లి. అంతే కాదు అవకాశాలు రాలేదు. అయితే బిగ్బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న ఓవియను ఆ గేమ్ షో మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. నటిగా అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, కథా నాయకుడిగా నటిస్తున్న కాంచన–3 చిత్రంలో ఓవియ కథా నాయకిగా నటిస్తోంది. ఇకపోతే సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో కలవాణి చిత్రానికి సీక్వెల్ తయారు అవుతోం ది. ఎనిమిదేళ్ల తరువాత కలవాణి–2 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అదే విమల్, ఓవియల జంట కలిసి నటిస్తున్నారు. కలవాణి చిత్ర దర్శకుడు సర్గుణం తన వర్ణన్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల మొదలైంది. ఇందులో నటించే ఇతర నటీనటులు, సంకేతిక వర్గాన్ని త్వరలో వెల్లడించనున్నట్లు దర్శక నిర్మాత సర్గుణం తెలిపారు. ఈ కలవాణి జంట మరోసారి మ్యాజిక్ చేస్తారా? అన్నది చూడాల్సిందే. ఇక ఈ చిత్ర టైటిల్ను గురువారం సాయంత్రం నటుడు శివకార్తికేయన్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడం విశేషం. ఇప్పటికే సర్గుణం మాధవన్ హీరోగా ఒక చిత్రం చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆయన సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నా రు. ఈ రెండు చిత్రాల షూటింగ్ మార్చిలో జరగనుందట. -
సీనీతో ఒవియకు అదృష్టం కలిసొచ్చేనా?
దేనికైనా పెట్టి పుట్టాలంటారు. నటి ఓవియ విషయానికొస్తే ఆమెకు అదృష్టం వచ్చినట్లే వచ్చి దూరం అయ్యింది. మళ్లీ అది అందకపోదా అంటూ ఆశతో ఎదురు చూస్తోంది. ఈ మలయాళీ కుట్టి కలవాణి చిత్రం ద్వారా కోలీవుడ్కు దిగుమతి అయిది.ఆ చిత్రంలో గ్రామీణ యువతిగా తమిళప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఆ చిత్రం విజయంతో ఓవియకు మంచి భవిష్యత్ ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావించారు. అన్నట్టుగానే అప్పట్లో కమలహాసన్ చిత్రం మన్మథఅంబు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని నటి ఓవియ చంకలు కొట్టుకుంటూ ప్రచారం చేసుకుంది. తీరా ఆ చిత్రంలో ఒక్క సీన్లో కనిపించీ కనిపించనట్లుగా వచ్చి మాయం అయ్యింది. తన గోడును అప్పట్లో మీడియా ముందు వెళ్లగక్కినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక అప్పటి నుంచి అడపా దడపా తమిళ చిత్రాల్లో నటిస్తూ మంచి బ్రేక్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. ఆ మధ్య కలగలప్పు లాంటి ఒకటి రెండు హిట్ చిత్రాల్లో నటించినా ఆమె కెరీర్కు పెద్దగా ఉపయోగపడలేదు. కొన్ని చిత్రాల్లో హద్దులు దాటి అందాలు ఆరబోసి ఆ విధంగానైనా మార్కెట్ పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక లాభం లేదు కేరళకు మూటా ముల్లు సర్దుకుని పోదామనుకున్న తరుణంలో సీనీ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చిందట. లక్కీగా ఈ చిత్రంలో పాటలకు, ప్రేమ సన్నివేశాలకు పరిమితం అయ్యే పాత్ర కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్ర అట. మదురై నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఓవియ చాలా ఆశలు పెట్టుకుందట. చేద్దాం ఈ అమ్మడి నమ్మకం ఏ మేరకు ఫలిస్తుందో.