సీనీతో ఒవియకు అదృష్టం కలిసొచ్చేనా? | seenee success for oviya ? | Sakshi
Sakshi News home page

సీనీతో ఒవియకు అదృష్టం కలిసొచ్చేనా?

Published Sun, Jan 10 2016 4:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

సీనీతో ఒవియకు  అదృష్టం కలిసొచ్చేనా?

సీనీతో ఒవియకు అదృష్టం కలిసొచ్చేనా?

దేనికైనా పెట్టి పుట్టాలంటారు. నటి ఓవియ విషయానికొస్తే ఆమెకు అదృష్టం వచ్చినట్లే వచ్చి దూరం అయ్యింది. మళ్లీ అది అందకపోదా అంటూ ఆశతో ఎదురు చూస్తోంది. ఈ మలయాళీ కుట్టి కలవాణి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయిది.ఆ చిత్రంలో గ్రామీణ యువతిగా తమిళప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఆ చిత్రం విజయంతో ఓవియకు మంచి భవిష్యత్ ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావించారు.
 
 అన్నట్టుగానే అప్పట్లో కమలహాసన్ చిత్రం మన్మథఅంబు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని నటి ఓవియ చంకలు కొట్టుకుంటూ ప్రచారం చేసుకుంది. తీరా ఆ చిత్రంలో ఒక్క సీన్‌లో కనిపించీ కనిపించనట్లుగా వచ్చి మాయం అయ్యింది. తన గోడును అప్పట్లో మీడియా ముందు వెళ్లగక్కినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక అప్పటి నుంచి అడపా దడపా తమిళ చిత్రాల్లో నటిస్తూ మంచి బ్రేక్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది.
 
  ఆ మధ్య కలగలప్పు లాంటి ఒకటి రెండు హిట్ చిత్రాల్లో నటించినా ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. కొన్ని చిత్రాల్లో హద్దులు దాటి అందాలు ఆరబోసి ఆ విధంగానైనా మార్కెట్ పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక లాభం లేదు కేరళకు మూటా ముల్లు సర్దుకుని పోదామనుకున్న తరుణంలో సీనీ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చిందట. లక్కీగా ఈ చిత్రంలో పాటలకు, ప్రేమ సన్నివేశాలకు పరిమితం అయ్యే పాత్ర కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్ర అట. మదురై నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఓవియ చాలా ఆశలు పెట్టుకుందట. చేద్దాం ఈ అమ్మడి నమ్మకం ఏ మేరకు ఫలిస్తుందో.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement