గోపి, ఎస్.వి. ప్రకాశ్, తరుణ్, రమేశ్
‘‘నాగార్జునగారు ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమా టీజర్ రిలీజ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. టీజర్ పెద్ద హిట్ అయింది. నా పుట్టినరోజున (08.01.) ట్రైలర్ విడుదల కావడం సంతోషంగా ఉంది. ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో తరుణ్ అన్నారు. తరుణ్, ఓవియా జంటగా రమేష్–గోపీ దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మించిన చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరీ’. తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని సోమవారం విడుదల చేశారు. తరుణ్ మాట్లాడుతూ– ‘‘ఇది రెగ్యులర్ ప్రేమకథ కాదు. ఇందులో మూడు గెటప్స్‌లో కనిపిస్తా.
ట్రిపుల్ రోల్ చేశానా? మూడు షేడ్స్ ఉన్న పాత్ర చేశానా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ చక్కగా కుదిరాయి’’ అన్నారు. రమేష్–గోపీ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమాల్లో ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. తరుణ్ నటించిన ‘నువ్వే కావాలి, నువ్వే నువ్వే’ సినిమాలకంటే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. లవర్స్‌కు మంచి ట్రీట్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఫిబ్రవరి 14న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు ఎస్.వి.ప్రకాష్. సంగీత దర్శకుడు శ్రీనాథ్ విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: జగదీశ్.ఎస్, అరుణ్ అజాద్, కో–ప్రొడ్యూసర్: ఎ.గణేశ్.
Comments
Please login to add a commentAdd a comment