జీవిత ఖైదీ పరారీ | prisoner jump in open air jail | Sakshi
Sakshi News home page

జీవిత ఖైదీ పరారీ

Published Fri, Oct 28 2016 10:10 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

prisoner jump in open air jail

బుక్కరాయసముద్రం : రెడ్డిపల్లి వద్ద గల ఓపెన్‌ఎయిర్‌ జైలు నుంచి జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న పామిడి మండలానికి చెందిన సూరి పరారయ్యాడు. హత్య కేసులో ఇతనికి జీవిత ఖైదు శిక్ష పడింది. సత్ప్రవర్తన కలిగి ఉన్నాడని కడప జిల్లా నుంచి మూడేళ్ల క్రితం రెడ్డిపల్లిలోని ఓపెన్‌ఎయిర్‌ జైలుకు తీసుకొచ్చారు. రోజు వారి కార్యక్రమాలలో భాగంగా ఖైదీలు వ్యవసాయ పనులకు వెళ్లారు.

గురువారం సాయంత్రం సూరి బ్యారెక్‌కు రాకపోవడంతో జైలు సిబ్బంది ఓపన్‌ ఎయిర్‌ జైలు పరిసర ప్రాంతాలన్నీ గాలించారు. శుక్రవారం ఉదయం కూడా గాలించారు. కనడపడకపోవడంతో ఓపన్‌ ఎయిర్‌ జైలు సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ విశ్వనాథ్‌ చౌదరి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement