నటుడు సూరీకి జల్లికట్టుతో సంబంధం ఏంటి? | Comedian Suri Jallikattu Photos Viral in Social Media | Sakshi
Sakshi News home page

నటుడు సూరీకి జల్లికట్టుతో సంబంధం ఏంటి?

Published Fri, Jul 10 2020 8:05 AM | Last Updated on Fri, Jul 10 2020 8:05 AM

Comedian Suri Jallikattu Photos Viral in Social Media - Sakshi

సినిమా: జల్లికట్టు తమిళ పారంపర్య క్రీడ. అంతే కాకుండా ఇది తమిళుల వీరత్వానికి చిహ్నం. ఈ జల్లికట్టును కేంద్రం నిషేధిస్తే తమిళులందరూ ఒకతాటిపై పోరాడి మళ్లీ సాధించుకున్న విషయం తెలిసిందే. అలాంటి జల్లికట్టుకు ప్రముఖ హాస్యనటుడు సూరికి సంబంధం ఏమిటి అన్నది ఇక్కడ చర్చనీయాంశం. ఇప్పుడు కోలీవుడ్లో ప్రముఖ హాస్యనటుడిగా రాణిస్తున్న సూరి త్వరలో కథానాయకుడిగా అవతారం ఎత్తనున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన జల్లికట్టు ఎద్దులతో ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ అవుతున్నాయి. ఇటీవల పలువురు కరోనా బాధితులను నిత్యావసర వస్తువులు అందించి ఆదుకున్న సూరి, తన పిల్లలతో కలిసి కరోనాపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు.

కాగా మదురై సమీపంలోని రాజాకూర్‌ గ్రామానికి చెందిన సూరి ఇటీవల స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ తమ జల్లికట్టు పందెపు ఎద్దుతో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేసి అందులో ఊరంతా లాక్‌డౌన్‌ లో ఉన్న సమయంలో ఊరంతా నిలవదు సూచించే మా జల్లికట్టు కరుప్పన్‌ అని ట్యాగ్‌లైన్‌ పోస్ట్‌ చేశారు. దీని గురించి సూరి పేర్కొంటూ తమ కరుప్పన్‌ (జల్లికట్టు ఎద్దు) ఇప్పటి వరకూ 40 జల్లికట్టు పోటీల్లో పాల్గొని అన్ని పోటీల్లో గెలుపొందిందని చెప్పారు. పందెంలో ఒక్కరూ కూడా తమ ఎద్దును టచ్‌ కూడా చేయలేక పోయారని చెప్పారు. తమ ఎద్దు సాధించిన బహుమతులు ఈ ఊళ్లో పెళ్లిళ్లు, వంటి విశేష వేడుకల్లో బహుమతిగా వారికి అందించడం జగుగుతుందని నటుడు సూరి తెలిపారు. ప్రస్తుతం తమ కరుప్పన్‌ బాధ్యతలను తన సోదరుడు చూసుకుంటున్నాడు అని ఆయన చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement