మనీషాకు మరో చాన్స్‌..! | Manisha Yadav to Play Lead In Vetrimaaran Film | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 20 2018 10:29 AM | Last Updated on Thu, Sep 20 2018 10:29 AM

Manisha Yadav to Play Lead In Vetrimaaran Film - Sakshi

వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు వెట్రిమారన్‌. ఆయన నటుడు ధనుష్‌తో కలిసి నిర్మించిన విచారణై, కాక్కాముట్టై వంటి చిత్రాలు సామాజిక సమస్యలపై తెరకెక్కి మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. తాజాగా యువ దర్శకుడు రామ్‌నాథ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు వెట్రిమారన్‌. రామ్‌నాథ్‌ ఇంతకు ముందు జీవా, నయనతార జంటగా నటించిన తిరునాళ్‌ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం.

తాజాగా ఇన్వెస్టిగేటివ్‌ కథాంశాన్ని తీసుకుని వెట్రిమారన్‌ గ్రాస్‌రూట్‌ సంస్థలో చిత్రం చేయనున్నారు. ఇందులో నటి  మనీషా యాదవ్‌ కథానాయకిగా నటించనుంది. మోడ్రన్‌ పాత్రలకైనా, గ్రామీణ యువతిగానైనా నటించి మెప్పించగల నటి మనీషాయాదవ్‌. తొలి చిత్రం వళక్కు ఎన్‌ 18/9 చిత్రంతోనే తనదైన నటనతో ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత ఆదలాల్‌ కాదల్‌ సెయ్‌వీర్, త్రిషా ఇల్లన్నా నయనతార వంటి చిత్రాల్లో నటించింది.

త్రిషా ఇల్లన్నా నయనతార చిత్రంలో తనను అశ్లీలంగా చూపించారని ఆ చిత్ర దర్శకుడిపై ఆరోపణలు గుప్పించి సంచలన సృషించిన ఈ అమ్మడు నటనకు కొంత కాలం దూరమైంది. అలా అనడం కంటే ఈ జాణను చిత్ర పరిశ్రమ దూరంగా పెట్టిందనే చెప్పాలి. ఇటీవల ఒరు కుప్‌పెకథై చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన ఈ అమ్మడికి నిర్మాత వెట్రిమారన్‌ అవకాశం ఇచ్చారు.

ఇందులో మనీషా యాదవ్‌ గ్రామీణ యువతి పాత్రలో నటించనుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్ర షూటింగ్‌ నవంబర్‌లో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో మనీషా యాదవ్‌ పాత్ర చాలా బలంగా ఉంటుందని దర్శక నిర్మాతలు అంటున్నారు. దీనితో పాటు మరో చిత్రం మనిషాను వరించింది. కొత్త దర్శకుడు మిల్కా సెల్వకుమార్‌ చిత్రంలోనూ నటించడానికి మనీషాయాదవ్‌ పచ్చజెండా ఊపింది. ఇది హర్రర్‌ కామెడీ కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement