ధనుష్‌కు జోడీగా సీనియర్‌ హీరోయిన్‌ | Dhanush to Romance Manju Warrier in Vetrimaaran Asuran | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 22 2019 12:37 PM | Last Updated on Tue, Jan 22 2019 12:38 PM

Dhanush to Romance Manju Warrier in Vetrimaaran Asuran - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ నటిస్తున్న తాజా చిత్రం అసురన్‌. ఇటీవల మారి 2తో మరో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ధనుష్‌ అసురన్‌ సినిమాలో డిఫరెంట్‌ లుక్‌లో అలరించనున్నాడు. ధనుష్‌ హీరోగా వడా చెన్నై సిరీస్‌ను తెరకెక్కిస్తున్న వెట్రీ మారన్‌ ఈసినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో ధనుష్‌కు జోడిగా ఓ సీనియర్‌ నటి కనిపించనుందట.

వెక్కై నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంజు వారియర్‌ హీరోయిన్‌గా నటించనుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న మంజు.. తనకన్నా చిన్నవాడైన ధనుష్‌కు జోడిగా నటిస్తుండటం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతమందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement