'మీ అమ్మాయిలతో ఇలాంటి సినిమా తీయండి'.. స్టార్‌ డైరెక్టర్‌పై దర్శకుడు తీవ్ర విమర్శలు | Director Mohan Slams Vetri Maaran For Brahmin Portrayal In Bad Girl, Tweets Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Director Mohan: 'ముందు మీ కుటుంబానికి సినిమా చూపించండి'.. వెట్రిమారన్‌పై డైరెక్టర్‌ ఆగ్రహం

Jan 27 2025 4:31 PM | Updated on Jan 27 2025 5:00 PM

Director Mohan slams Vetri Maaran for Brahmin portrayal in Bad Girl

అంజలి శివరామన్, శాంతి ప్రియ, శరణ్య రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం బ్యాడ్ గర్ల్. ఈ మూవీని వర్ష భరత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్రాస్ రూట్‌ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌పై కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ వెట్రిమారన్, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

అయితే ఈ సినిమాపై మరో డైరెక్టర్‌ మోహన్ జి క్షత్రియ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని బ్రాహ్మణ ‍అమ్మాయి వ్యక్తిగత జీవితం ఆధారంగా తెరకెక్కించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరించడం మీకు ఎల్లప్పుడూ బోల్డ్‌గా అనిపించొచ్చు.. కానీ వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నుంచి ప్రేక్షకులు ఇంకా ఏం ఆశించాలని ప్రశ్నించారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో తల్లిదండ్రులను దూషించమనేది పాతదే.. ఇందులో ఎలాంటి కొత్తదనం లేదని అన్నారు. ముందు మీ కులం అమ్మాయిలతో ఇలాంటి సినిమాలు తీసి వాటిని మీ కుటుంబానికి చూపించండి అంటూ కాస్తా ఘాటుగానే ట్వీట్ చేశారు. కుల ఆధారిత సినిమాలను తెరకెక్కించడం పట్ల వెట్రిమారన్, అనురాగ్‌ కశ్యప్‌పై  మోహన్ జి క్షత్రియ తీవ్రస్థాయిలో  విమర్శలు చేశారు.

అయితే ఈ బ్యాడ్ గర్ల్ చిత్రాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డ్యామ్ -54వ ఎడిషన్‌లో వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ప్రతిష్టాత్మకమైన టైగర్ కాంపీటీషన్ విభాగంలో ఈ మూవీ పోటీపడుతోంది. ఈ చిత్రంలో హృదు హరూన్, టీజే అరుణాసలం, శశాంక్ బొమ్మిరెడ్డిపల్లి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రాధా శ్రీధర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం చెన్నైలో విడుదల చేశారు. ఇందులో ఎప్పుడూ బాయ్‌ఫ్రెండ్ ఉండాలని కోరుకునే టీనేజ్ అమ్మాయిగా (అంజలి శివరామన్) కనిపించింది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యుక్తవయస్సులో ఉండే పాత్రలో అంజలి శివరామన్ నటించింది. ఆమె తన తల్లిదండ్రుల నుంచి తరచూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు టీజర్‌లో చూపించారు. ఊహించని ఓ సంఘటన ఆమెను ఇంటి నుంచి బయటకు వచ్చేలా చేస్తుంది. ఈ నిర్ణయం ఆమె ఎప్పుడూ ఉండాలనుకునే వ్యక్తిగా మారేలా చేస్తుంది. డేటింగ్ యాప్ గురించి తల్లి, కూతురు మాట్లాడుకోవడంతో టీజర్ ముగుస్తుంది.

va

టీజర్‌పై పా రంజిత్ ప్రశంసలు..

అయితే బ్యాడ్‌ గర్ల్ టీజర్‌పై డైరెక్టర్ పా రంజిత్‌ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి సాహోసపేతమైన కథను అందించినందుకు వెట్రిమారన్‌ను కొనియాడారు. ఈ చిత్రం మహిళల పోరాటాలను సినిమా రూపంలో మీ ముందుకు తీసుకొస్తుందని.. డైరెక్టర్‌ వర్ష భరత్‌కు అభినందనలు తెలిపారు. అంజలి శివరామన్ ‍అద్భుతంగా నటించిందని పా రంజిత్ ‍ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement