vidhya sagar
-
మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందా? ఆమె క్లోజ్‌ఫ్రెండ్ ఏమందంటే..
టాలీవుడ్ నటి మీనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలె భర్త విద్యాసాగర్‌ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుస షూటింగ్స్‌లో పాల్గొంటుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాలకు ఆమె సైన్ చేసింది. ఇదిలా ఉండగా గత రెండు, మూడు రోజులుగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. తల్లిదండ్రుల ఒత్తిడి, కూతురి భవిష్యత్తును దృష్టిని ఉంచుకొని మీనా రెండో పెళ్లికి ఒకే చెప్పిందంటూ వార్తలు వైరల్ అవతున్నాయి. ఈ విషయం మీనా చెవిన కూడా పడిందట. దీంతో ఇలాంటి రూమర్స్‌ని వైరల్ చేస్తున్నందుకు మీనా ఆగ్రహం వ్యక్తం చేసిందట. 'డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని రాయండి. నా భర్త చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు. తనపై అసత్య వార్తలు రాస్తే వాళ్లపై చర్యలు తీసుకుంటా' అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక మీనా రెండో పెళ్లిపై వస్తున్న వార్తలను ఆమె క్లోజ్‌ఫ్రెండ్ ఒకరు తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ఒకవేళ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మీనానే స్వయంగా ప్రకటిస్తుందని, పుకార్లు సృష్టించొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు. -
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి...
విద్యాసాగర్ పేరు చెప్పగానే ‘ఏ అంటే అమల బి అంటే భానుప్రియ’ వంటి అల్లరి పాటలు వినిపిస్తాయి. ‘చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతిపూల మేడ కట్టనా’ అనే కమర్షియల్ హిట్స్ గుర్తుకొస్తాయి. ‘చుక్కా చుక్కా కన్నీటి చుక్కా బుగ్గన జారొద్దు’ వంటి సెంటిమెంట్ పాటలు కదిలిస్తాయి. ‘తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా’ వంటి మెలొడీలు చుట్టుముడతాయి. విద్యాసాగర్ మరో ఇళయరాజాగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు. విజయనగరం నుంచి వచ్చిన తెలుగు గీతమే అయినా తమిళంలో, మలయాళంలో ఎక్కువ గుర్తింపు పొందాడు. మార్చి 2 ఆయన పుట్టినరోజు. బొబ్బిలి సంస్థానం నుంచి... విద్యాసాగర్ తాత తండ్రులది బొబ్బిలి సంస్థానం. వాళ్లది సంగీత కుటుంబం. విద్యాసాగర్ తండ్రి రామచందర్ సినిమాల్లో పని చేయాలని 1950లలోనే మద్రాసు వచ్చారు. విద్యాసాగర్ అక్కడే పెరిగారు. తండ్రి వద్ద తొలి సంగీత విద్యలు నేర్చుకుని 11 ఏళ్ల వయసులో లండన్ ట్రినిటి కాలేజ్‌లో సంగీతం నేర్చుకున్నారు. విద్యాసాగర్ మొదట రీరికార్డింగ్‌లో గుర్తింపు పొందారు. వందలాది సినిమాలకు రీరికార్డింగ్ చేశారు. ఆ తర్వాత తమిళంలో మొదట... తర్వాత తెలుగులో సంగీత దర్శకుల య్యారు. రెండు చోట్లా కొన్ని అపజయాల తర్వాత మలయాళంలో హిట్ కొట్టి తర్వాత సౌత్‌లోని అన్ని భాషల్లో హిట్స్ ఇచ్చారు. మెలొడీస్ ఇష్టం విద్యాసాగర్‌కు మెలొడీలు ఇష్టం. ‘ఓ చినదానా’లో ‘తన చిరునామా అడిగితే ప్రేమ నిను చూపెడుతోందే’ అలాంటి మెలొడీనే. ‘చిత్రం భళారే విచిత్రం’లో ‘నవ్వుకునే మన యవ్వనమే ఒక పువ్వుల తోటంట’ కూడా అదే మెలొడీ. రాజశేఖర్ నటించిన ‘విలన్’లో ‘నా గుండె గుడి లో నువు శిలవా దేవతవా’ పెద్ద హిట్. ఇక తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన మెలొడీలు కూడా హిట్టే. అర్జున్ నటించిన ‘కర్ణ’ సినిమాలో ‘పలికే మౌనమా’ చాలా పెద్ద హిట్. అన్నింటికి మించి ‘చంద్రముఖి’ కోసం చేసిన ‘కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి’ క్లాసిక్‌గా నిలిచింది. ‘చంద్రముఖి’ విద్యాసాగర్ ను టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలిపింది. అందులోని ‘చిలకా పద పదా’, ‘రారా సరసకు రారా’ అద్భుతంగా అమరాయి. విద్యాసాగర్ కె.విశ్వనాథ్ ‘స్వరాభిషేకం’కు, బాపు ‘సుందరకాండ’కు పనిచేశారు. పవన్ కల్యాణ్ ‘బంగారం’ సినిమాకు ‘రా..రా.. రారా బంగారం’ మాస్ హిట్ ఇచ్చారు. విద్యాసాగర్ మరెన్నో మంచి పాటలు అందించాలని కోరుకుందాం. -
ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!
సాక్షి, హైదరాబాద్ : వాళ్ల వివాహం ఆదర్శంగా నిలిచింది. అబ్బాయి ఎత్తు 5.4 అడుగులు, అమ్మాయి ఎత్తు 3.2 అడుగులు... వారిద్దరి ఎత్తులో చాలా తేడా ఉన్నప్పటికీ, వారి మనసులో మాత్రం ఎలాంటి భేదం లేదు. ఇద్దరూ మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. ఆదర్శ జంటగా నిలిచారు. ముషీరాబాద్‌లోని హెరిటేజ్ ఫంక్షన్ ప్యాలెస్ ఈ వేడుకకు వేదికైంది. గురువారం రాత్రి 8గంటలకు బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వరుడు చిదురాల విద్యాసాగర్ (25)ది సిద్దిపేట. తల్లిదండ్రులు చంద్రమౌళి, నాగమణి మృతి చెందడంతో కొంతకాలంగా అక్క దగ్గరే ఉంటూ పీజీ పూర్తి చేశాడు. ఇక పెళ్లి కుమార్తె వీరవల్లి రవళి (22). తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మ. వీరిది సికింద్రాబాద్‌లోని మహంకాళి ప్రాంతం. రవళికి ఒక సోదరుడు ఉండగా, వీరిద్దరూ మరుగుజ్జులే. రవళి ప్రస్తుతం అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. వధూవరులు ఇద్దరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం, ఇల్లరికం రావాలని కోరగా వరుడు ఒప్పుకోవడంతో పెద్దల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. -
బెజవాడలో ఐఏఎస్ అధికారి సోదరి అదృశ్యం
విజయవాడ: నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా వైద్యురాలు సూర్యకుమారి అదృశ్యం కలకలం రేపుతోంది. కృష్ణాజిల్లా విస్సన్నపేటలోని ఓ ఆస్పత్రిలో ఆమె వైద్యురాలిగా పని చేస్తోంది. అదృశ్యమైన సూర్యకుమారి కర్ణాటక క్యాడర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సోదరిగా సమాచారం. కుటుంబసభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో ఆమె అదృశ్యంపై తూర్పు మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడు విద్యాసాగర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా సూర్యకుమారి రెండు రోజుల క్రితం విద్యాసాగర్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి ఇంట్లో సోదాలు చేపట్టి సీసీ టీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా విద్యాసాగర్ తల్లి మాట్లాడుతూ... రెండ్రోజుల క్రితం సూర్యకుమారి తన ఇంటికి వచ్చారని, అయితే ఆమె అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయినట్లు తెలిపారు. కాగా అటు మాజీ ఎమ్మెల్యే, ఇటు ఐఏఎస్ అధికారి కుటుంబాలు కావడంతో పోలీసులు ఈ కేసులో గోప్యత పాటిస్తున్నారు ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ
ఫిరంగిపురం, న్యూస్‌లైన్: నీతివంతులైన సేవకులు విశ్వాసం వలన జీవించునని తాటిపత్రి జ్ఞానమ్మ నిరూపించారని గుంటూరు పీఠాధిపతి గాలిబాలి కొనియాడారు. బుధవారం స్థానిక అన్నమ్మ మఠ సంస్థల వ్యవస్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మను దైవసేకురాలిగా ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నీతివంత మైన జీవితం గడిపిన వారు దేవుని బిడ్డలుగా గుర్తింపబడతారని, అందుకు నిదర్శనమే పునీత తాటిపత్రి జ్ఞానమ్మ అన్నారు. తాటిపత్రి జ్ఞానమ్మ స్థాపించిన సెయింట్ ఆన్స్ సంస్థలు చేస్తున్న సేవలను గుర్తించి వాటికన్లో ఉన్న పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ తమకు సందేశాన్ని పంపారన్నారు. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో ఇస్సాకు తన విశ్వాసం అనే విత్తనం నాటి ఏవిధంగా ఒక మంచి పెద్ద వృక్షాన్ని తయారు చేశారో అదే విధంగా విశ్వాసం అనే సెయింట్ ఆన్స్ సంస్థల మొక్కని తాటిపత్రి జ్ఞానమ్మ నాటరాన్నారు. జ్ఞానమ్మకు దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయని, నాడు ఆమె నాటిన సెయింట్ ఆన్స్ అనే మొక్క జిల్లా రాష్ట్రం, దేశవ్యాప్తంగా విస్తరించినదన్నారు. ఒక సాధారణ గృహిణిగా ఉన్న ఆమె ఇలా దైవ సేవకురాలిగా ప్రకటించబడడం మహిళా లోకానికే వన్నె తెచ్చిందన్నారు. తాటిపత్రి జ్ఞానమ్మను దైవసేవకురాలిగా ప్రకటిస్తూ వాటికన్‌సిటీలోని పరిశుద్ధ పోప్ నుంచి లాటిన్, తెలుగు, ఇంగ్లీష్ భాషలలో అందిన సందేశాన్ని గుంటూరు పీఠాధిపతి గాలిబాలి, నెల్లూరు బిషప్ ఎం.డి.ప్రకాశం, చైన్నై విచారణ గురువు ఛార్లెస్ కుమార్ చదివి వినిపించారు. జ్ఞానమ్మ చిత్ర పటాన్ని ఆవిష్కరించారు. తొలుత స్థానిక సెయింట్ ఆన్స్ ప్రోవిన్షిలేట్ నుంచి సెయింట్ ఆన్స్ సంస్థల మదర్ జనరల్ బోయపాటి ఫాతిమా ఆధ్వర్యంలో వే దిక వద్ద బిషప్ డా.గాలిబాలి, ఎం.డి.ప్రకాశంలను మేళతాళాల మధ్య స్వాగతం పలికారు. కార్యక్రమంలో సుపీరియర్ జనరల్ రోజిరియా , గుంటూరు డిజిఎం పూదోట ఇన్నయ్య, ఆలయ సహాయ విచారణ గురువు ఫాదర్ బత్తినేని విద్యాసాగర్ పాల్గొన్నారు. జిల్లా, రాష్ర్ట్రం, దేశంతోపాటు, ఇతర దేశాల నుంచి వచ్చిన సుమారు 1000 మంది ఫాదర్స్, సిస్టర్స్ పాల్గొన్నారు. సిస్టర్స్ బృందం భక్తి గీతాలు ఆలపించారు. సెయింట్ ఆన్స్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి బాల ఏసు కెథడ్రల్ దేవాలయ విచారణ గురువు బెల్లంకొండ జయరాజు అధ్యక్షత వహించారు. -
టీ-టెన్షన్
పార్లమెంట్ చివరి సమావేశాలు ముగిసేందుకు మిగిలింది ఐదు రోజులే. సోమవారం నుంచి జరుగనున్న చివరి విడత సమావేశాలే తెలంగాణ భవితవ్యాన్ని తేల్చనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచి జిల్లా క్రియాశీల పాత్ర నిర్వహిస్తోంది. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో లోక్‌సభలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు గట్టిగా తమ వాణిని వినిపించారు. ప్రస్తుతం తెలంగాణ ఏర్పాటు అంశం క్లైమాక్స్‌కు చేరుకున్న సందర్భంగా యావత్తు జిల్లా ప్రజల దృష్టి ఢిల్లీ మీదకు మళ్లింది. సాక్షి, కరీంనగర్: జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, వివేకానంద సభలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీలను నిలువరించడానికి గట్టిగా ప్రయత్నించారు. లగడపాటి ప్రయోగించిన పెప్పర్‌స్ప్రేతో పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం నుంచి జరిగే సమావేశాల్లోనూ జిల్లా ఎంపీలు ఫ్లోర్ మేనేజ్మెంటులో కీలక పాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పరిణామాలను జిల్లా ప్రజలంతా ఉద్విగ్నంగా గమనిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్, విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనారాయణ, గంగుల కమలాకర్, నాయకులు బి.వినోద్‌కుమార్, నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు ఢిల్లీలో మకాం వేశారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించేందుకు అవసరమయిన మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా జేఏసీ, ఉద్యోగ సంఘాల ముఖ్య నాయకులు హమీద్, నరసింహస్వామి, సుద్దాల రాజయ్య కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. జాతీయ నాయకులను కలుస్తూ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురు న్యాయవాదులు కూడా అక్కడే ఉండి తమ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు. ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం కూడా ఢిల్లీలోనే మకాం వేసి వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారు. ఢిల్లీలో ఎప్పడేం జరుగుతుందో... ఏ పార్టీ ఎప్పడు ఏ వైఖరి తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొనడంతో తెలంగాణ భవితవ్యం మీద సందిగ్ధం నెలకొంది. సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో సమైక్య ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనల ప్రభావం తెలంగాణ అంశం మీద ఎలా ఉంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది. సమైక్య ఆందోళనల ప్రభావంతో తెలంగాణ వెనక్కి పోకుండా మరింత పట్టుదలతో కృషి చేయాలని తెలంగాణవాదులు భావిస్తున్నారు. మంగళవారంగానీ, బుధవారంగానీ బిల్లు మీద చర్చ జరిగే అవకాశం ఉండడంతో ఈ రెండు రోజులే కీలకంగా మారాయి. -
కొండగట్టులో ‘మేడారం’ జాతర
మేడారం జాతర సమీపిస్తున్న కొద్దీ.. కొండగట్టు అంజన్న దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం రాష్ట్రనలుమూలల నుంచి సుమారు 1.20 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో అధికారులు వేకువజాము ఐదు గంటల నుంచే భక్తులకు సర్వదర్శనానికి అనుమతినిచ్చారు. ఏర్పాట్లను ఈవో రాజేశ్వర్, ఏఈవో శ్రీనివాస్, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఎస్సై విద్యాసాగర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబసు నిర్వహించారు. - న్యూస్‌లైన్, మల్యాల