Drishyam 2 Movie Released On Amazon Prime Video - Sakshi
Sakshi News home page

దృశ్యం 2: మోహన్‌ లాల్‌ కథకు ప్రాణం పోశారు..

Published Fri, Feb 19 2021 7:15 PM | Last Updated on Fri, Feb 19 2021 8:38 PM

Drishyam 2 Movie: Released On Amazon Prime On 19th February - Sakshi

మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘దృశ్యం-2’ ఈ రోజు అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైంది. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఆరేళ్ల క్రితం సెన్సెషనల్ హిట్‌ సాధించిన ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు మరో మూడు భాషల్లో రీమేక్ అయ్యిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక తాజాగా మలయాళంలో విడుదలైన ఈ మూవీ సిక్వెల్‌కు‏ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సందర్భంగా సీని రచయిత‌ శీధర్‌ పిల్లై ట్వీట్‌ చేశారు.

‘అద్భుతమైన ఆరంభం. దృశ్యం లాగే ఈ సీక్వెల్‌ కూడా ప్రేక్షక ఆదరణతో ముందుకు వెళుతోంది. జీతూ జోసెఫ్‌ స్మార్ట్‌ రైటింగ్‌, థ్రిల్లింగ్‌ థాట్‌కు జార్టీ కుట్టిగా మోహన్‌ లాల్‌ కథకు ప్రాణం పోశారు’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. కాగా దృశ్యంలో తన కుటుంబం జోలికి వచ్చిన వరుణ్‏ను కూతురు హత్య చేయడం.. ఆ మృతదేహాన్ని ఎవరూ ఉహించని విధంగా పోలీస్ స్టేషన్లోనే పాతిపెడతాడు జార్జి కుట్టి (మోహన్ లాల్). ఇక ఆ తర్వాత జార్జి తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. కానీ ఆ కేసును మాత్రం పోలీసులు వదిలి పెట్టరు. జార్జికి తెలియకుండా ఆ కేసును ఇంకా దర్యాప్తు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని కీలక సాక్ష్యాలు దొరుకుతాయి. ఆ సాక్ష్యాలెంటీ.. మళ్లీ వాటి వలన జార్జి కుటుంబానికి ఎదురైన సమస్యలను దర్శకుడు దృశ్యం 2లో చూపించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement