నాలాగే ఒంటరిగా చాలామంది ఉన్నారు.. తప్పుగా రాయకండి: మీనా | Actress Meena Comments On Second Marriage Rumours, Deets Inside - Sakshi
Sakshi News home page

Meena On Second Marriage: దేశంలో నాలాగే ఒంటరిగా చాలామంది ఉన్నారు.. తప్పుగా రాయకండి

Published Sun, Mar 24 2024 9:29 AM | Last Updated on Sun, Mar 24 2024 1:13 PM

Actress Meena Comments On Second Marriage - Sakshi

బాలనటిగా వెండితెరపై రంగప్రవేశం చేసిన మీనా.. ఆ తర్వాత కొంతకాలానికే హీరోయిన్‌గానూ మారింది. దక్షిణాదిన ఎందరో స్టార్‌ హీరోలతో జోడి కట్టి తనదైన నటనతో కోట్లాదిమందిని తన అభిమానులుగా మార్చుకుంది. దాదాపు మూడు దశాబ్దాలపాటు అగ్రతారగా వెలుగొందింది. కెరీర్‌ పీక్స్‌లో ఉండగా వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరికి నైనికా అనే పాప జన్మించింది. 2022లో మీనాను ఒంటరి చేస్తూ విద్యాసాగర్‌ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఆమెపై పలు పుకార్లు వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఆమె పలుమార్లు వాటికి క్లారిటీ ఇచ్చింది.. అయినా కూడా ఆమెపై సోషల్‌ మీడియా దాడి తగ్గడం లేదు.

ఇప్పటికే సోషల్‌ మీడియాలో హీరో ధనుష్‌తో మీనాకు లింక్‌ చేశారు. చాలామందితో సంబంధం అంటగట్టారు.. రెండో పెళ్లి అంటూ రూమర్స్‌ క్రియేట్‌ చేశారు. అవి చదివిన తన ఫ్యామిలీ ఎంత బాధపడుతుందని ఆమె పలుమార్లు చెప్పుకొచ్చింది. అయినా కూడా తాజాగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు రాయడం ప్రారంభించారు. దీంతో ఆమెకు ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి ప్రచారం గురించి మరోసారి ప్రశ్న ఎదురైంది. 

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్‌ని వైరల్‌ చేస్తున్నవారిపై మీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. 'డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్‌ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని రాయండి. వాస్తవాలు తెలుసుకొని రాస్తే.. అందరికీ మంచిది. దేశంలో నాలాగే ఒంటరిగా జీవించేవారు చాలామంది మహిళలు ఉన్నారు. నా తల్లిదండ్రులు, కూతురు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. ప్రస్తుతానికి రెండో పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన లేదు. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో ఇప్పుడు ఎలా చెప్తాను. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు ఉంటే తప్పకుండా నేనే మీడియాకు ప్రకటిస్తాను. అంతవరకు ఇలాంటి పుకార్లను ఎవరూ పట్టించుకోవద్దు.' అని చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement