ఓటీటీలోకి మరో క్రేజీ బ్లాక్‌బస్టర్ వచ్చేసింది. 'సలార్'కి పోటీగా మలయాళంలో రిలీజైన ఈ మూవీ అద్భుతమైన హిట్‌గా నిలిచింది. కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్‌గా నిలిచిందనే టాక్ వినిపించింది. ఇకపోతే ఈ సినిమాని వెంకటేశ్ రీమేక్ చేస్తారనే వార్తలొచ్చాయి కానీ అలాంటిదేం లేకుండానే తెలుగు వెర్షన్ కూడా ఇప్పుడు ఓటీటీలో రిలీజైపోయింది. ఇంతకీ ఇదే సినిమా? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది?
ఆ కాంబో మళ్లీ
మలయాళ ఇండస్ట్రీ అంటే డిఫరెంట్ సినిమాలకు పెట్టింది పేరు. స్టార్ హీరోలు కూడా ఇమేజ్ చట్రంలో పడిపోకుండా అప్పుడప్పుడు స్టోరీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంటారు. అలా గతేడాది మోహన్‌లాల్ లాయర్ పాత్రలో 'నెరు' అనే సినిమా చేశారు. 'దృశ్యం' లాంటి థ్రిల్లర్ మూవీస్‌తోనూ చాలా క్రేజ్ తెచ్చుకున్న జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో మనకు తెలిసిన ప్రియమణి కూడా ఓ లాయర్‌గా నటించడం విశేషం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్)
ఆ ఓటీటీలోనే
ఇకపోతే మలయాళంలో మాత్రమే డిసెంబరు 21 ఈ సినిమా రిలీజైంది. నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సీరియస్‌గా సాగే కోర్టు రూమ్ డ్రామా చిత్రాలు ఇష్టపడితే మాత్రం దీన్ని అస్సలు మిస్సవొద్దు.
'నెరు' కథేంటి?
కళ్లు కనిపించని ఓ అమ్మాయి.. మానభంగానికి గురవుతుంది. అయితే వ్యక్తిని గుర్తించలేనప్పటికీ.. మట్టితో అతడి పోలికలున్న ఓ బొమ్మని తయారు చేస్తుంది. దీనిబట్టి పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఓ కుర్రాడిని అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత కోర్టులో ఏం జరిగింది? బాధితురాలికి న్యాయం జరిగిందా? లేదా అనేది 'నెరు' స్టోరీ.
(ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్)
Comments
Please login to add a commentAdd a comment