నిర్మాతగా మీనా? | Actress Meena To Turn Into A Producer? | Sakshi
Sakshi News home page

నిర్మాతగా మీనా?

Published Sat, May 21 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

నిర్మాతగా మీనా?

నిర్మాతగా మీనా?

ఒక సంచలన వార్త చిత్ర పరిశ్రమలో హల్‌చల్ చేస్తోంది. మీనా బహుభాషా నటి అన్న విషయం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంలో రజనీకాంత్,కమలహాసన్, శరత్‌కుమార్ ఇలా ప్రముఖ నటులందరితోనూ జతకట్టారు. అలాగే తెలుగులో చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్స్ అందరి సరసన నటించారు. ఇప్పటికీ అడపాదడపా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఆ మధ్య తెలుగులో దృశ్యం చిత్రంలో వెంకటేశ్‌కు భార్యగా ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించిన విషయం విదితమే.

తాజాగా తన వారుసురాలిని బాల నటిగా రంగంలోకి దింపారు. మీనా కూతురు నైనికా తెరి చిత్రంలో విజయ్‌కు కూతురిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇలా ఒక పక్క నటిస్తూ, మరో పక్క తన వారసురాలి సినీ పయనానికి బాటలు వే స్తూ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్న మీనా తాజాగా నిర్మాతగా అవతారమెత్తడానికి రంగం సిద్ధం చేస్తున్నారన్నది తాజా సమాచారం.

తమిళం,తెలుగు భాషల్లో భారీ చిత్రాలను నిర్మించడానికి సన్నద్ధం అవుతున్నారనిచిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం. ప్రారంభంలోనే విశ్వనాయకుడు కమలహాసన్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబులతో చిత్రాలు నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ముందుగా బ్యానర్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement