
మీనా.. తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్. దాదాపు అందరు అగ్ర హీరోలతోనూ నటించింది. ఎన్నడూ వివాదాల జోలికి వెళ్లిందే లేదు. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ నటిగా రాణిస్తోంది. అయితే మీనా, ఆమె తల్లి తనను అవమానించారంటున్నాడు ఓ నిర్మాత.
దురుసు వ్యాఖ్యలు
మాణిక్యం నారాయణన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. ఓ ప్రోగ్రామ్ చేయమని పిలవడానికి మీనా దగ్గరకు వెళ్లాను. కానీ అటు వైపు నుంచి నాకు సరైన స్పందన రాలేదు. మీనాయే కాదు ఆమె తల్లి కూడా చాలా దురుసుగా మాట్లాడారు. నేనొక నిర్మాతను.. నాలాంటి నిర్మాతలే కదా మీ సినిమాలకు కావాల్సింది. అలాంటి నన్ను పట్టుకుని అలా చీప్‌గా మాట్లాడతారా? నాకు చాలా బాధేసింది.

వాళ్లందరూ నా స్నేహితులే
ఈ అనుభవంతో ఇంకెప్పుడూ ఎవరినీ ఏదీ అడగకూడదని తెలిసొచ్చింది. సౌత్ ఇండస్ట్రీలో ఖుష్బూ, రోజా, సుహాసిని ఇలా చాలామంది సూపర్ హీరోయిన్లు నాకు స్నేహితులే! వాళ్లు నా కుమారుడి వివాహానికి కూడా వచ్చారు. అయినా ఈ ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉండటమే నయం అని పేర్కొన్నాడు. ఈయన వ్యాఖ్యలు ఫిల్మీదునియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
Comments
Please login to add a commentAdd a comment