స్వీయ నిర్బంధం నుంచి విముక్తి... | Liberation from self-restraint | Sakshi
Sakshi News home page

స్వీయ నిర్బంధం నుంచి విముక్తి...

Published Mon, Jul 17 2017 1:49 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

స్వీయ నిర్బంధం నుంచి విముక్తి...

స్వీయ నిర్బంధం నుంచి విముక్తి...

రిమ్స్‌ ఆస్పత్రికి అక్కాచెల్లెళ్ల తరలింపు.. ‘సాక్షి’ చొరవపై ప్రశంసలు
సాక్షి, ఆదిలాబాద్‌: స్వీయ నిర్బంధం నుంచి అక్కాచెల్లెళ్లకు విముక్తి కల్పించారు. ఆదిలా బాద్‌లో 8 నెలలుగా ఒకే గదిలో స్వీయ నిర్బం« దంలో ఉన్న అక్కాచెల్లెలు గంగీత (26), మీనా (24)లకు ప్రభుత్వ యంత్రాంగం కౌన్సెలింగ్‌ నిర్వహించి చికిత్సల కోసం ఆది లాబాద్‌ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు, తమ్ముడి మృతి వారిని కుంగదీసింది. ఒంటరి వారమయ్యా మని జనం ఏం నిందలు వేస్తారోనని భావన వారిని బాహ్య ప్రపంచానికి దూరం చేసింది. దీంతో 8నెలలుగా స్వీయ నిర్బంధంలో బతు కీడుస్తున్నారు. ‘సాక్షి’ పత్రిక మెయిన్‌లో ఈ నెల 12న ‘అక్కాచెల్లెళ్ల స్వీయ గృహ నిర్బం ధం’ శీర్షికన కథనం ప్రచురితమైంది.

దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు ముందుకువచ్చి వారికి భోజనం పెడుతూ సహాయ పడ్డారు. బట్టలు, నిత్యావసర సరుకు లు అందజేశారు. స్వచ్ఛంద సంస్థ వద్దకు వచ్చినపక్షంలో ఆదరిస్తామని చెప్పినప్పటికీ వారు అంగీకరించకపోవడంతో వెనుదిరిగా రు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఆదివారం రంగంలోకి దిగింది. ఆదిలాబాద్‌ జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు, సెడ్స్‌ స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి ఆది లాబాద్‌ రూరల్‌ పోలీసుల బందోబస్తుతో ఖానాపూర్‌ శివారులో ఇందిరమ్మ కాలనీకి చేరుకున్నారు.

జేసీ ఆదేశాలతో డీఎంహెచ్‌ఓ రాజీవ్‌రాజ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సాధన వారికి వైద్య పరీక్షలు చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని నిర్ధారణ కావడంతో ఆస్పత్రికి తరలించారు. జేసీ ఆదేశాల మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్భయ కేంద్రం లీగల్‌ అడ్వైజర్‌ మంజుల వారి సంరక్షణ కోసం ఓ మహిళా హోంగార్డును ఏర్పాటు చేశారు. వారు మానసికంగా కోలుకున్న తర్వా త ఉపాధి కల్పిస్తామని జేసీ తెలిపారు. చొరవ చూపి ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల పరిస్థితిని వెలు గులోకి తెచ్చినందుకు పలువురు మానవతా వాదులు ‘సాక్షి’కి అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement