Actress Meena And Her Family Tests Covid Positive, Details Inside - Sakshi
Sakshi News home page

Actress Meena: కొత్త సంవత్సరంలో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్‌

Published Wed, Jan 5 2022 1:52 PM | Last Updated on Thu, Jan 6 2022 7:31 AM

Actress Meena Tweets She And Her Family Tested Coronavirus Positive - Sakshi

కొత్త సంవత్సరంలో ఊహించని రీతిలో సీనియర్‌ నటి మీనా తన అభిమానులను పలకరించారు. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన మీనా ప్రస్తుతం తల్లి, సహానటి పాత్రలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆమె మీడియా, సోషల్‌ మీడియాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ క్రమంలో న్యూ ఇయర్‌లో తొలిసారిగా సోషల్‌ మీడియాలోకి వచ్చిన మీనా ఓ బ్యాడ్‌ న్యూస్‌ పంచుకున్నారు.

చదవండి: వారిని అలా చూస్తుంటే అసూయ కలుగుతోంది: స్టార్‌ హీరో

అంతేకాదు అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరించారు. ఆమె ట్వీట్‌ చేస్తూ.. 2022లో వారి ఇంటికి వచ్చిన తొలి గెస్ట్‌ ఎవరో చెబుతూ ఆసక్తికంగా చెప్పుకొచ్చారు. ఇంతకి ఆ గెస్ట్‌ ఎవరో తెలుసా.. అయితే ఆమె పోస్ట్‌ చూడాల్సిందే. ‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

చదవండి: నాకింగా 29యే, 30 తర్వాత ఆలోచిస్తా: సాయి పల్లవి


 

బాధ్యతగా మసలుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకు కూడా చోటివ్వండి’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. ఫన్నీగా, వ్యంగ్యంగా చేసిన ఆమె పోస్ట్‌ ప్రస్తుతం ఆకట్టుకుంటున్నప్పటికీ.. మీనా కుటుంబం మొత్తానికి కరోనా సోకడంతో ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘దీంతో మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. గెట్‌వెల్‌ సూన్‌ మేడం’ అంటూ ఆమె ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా మీనా చివరిగా దృశ్యం 2లో కనిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement