
మీనా
కరోనా లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూత పడటంతో వెబ్ సిరీస్‌లకు క్రేజ్ పెరిగింది. దీంతో స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు సైతం డిజిటల్ రంగంవైపు అడుగులేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సీనియర్ నటి మీనా చేరారు. 90లలో తెలుగు, తమిళ భాషల్లో టాప్ స్టార్‌గా రాణించిన మీనా మొదటిసారి ‘కరోలిన్ కామాక్షి’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు.
ఆమె సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారట. మీనా పాత్ర పేరు కామాక్షి. లాక్‌డౌన్‌కి ముందు కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సిరీస్ లాక్‌డౌన్‌తో ఆగిపోయింది. ఈ నెల 11న బ్యాలె¯Œ ్స చిత్రీకరణని ప్రారంభించి శరవేగంగా పూర్తి చేశారట. వివేక్ కుమారన్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్‌ని ట్రెండ్ లౌడ్ ప్రొడక్ష¯Œ ్స నిర్మించింది. త్వరలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment