ఎక్స్‌పోజింగ్ పాత్రలు ఆయన వల్లే చేశా.. బయటకు రాలేకపోయా: మీనా | Meena Comments On Glamour Roles And Bikini Scenes | Sakshi
Sakshi News home page

Meena: బోల్డ్ సీన్స్, బికినీ గురించి హీరోయిన్ మీనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published Sun, Jan 21 2024 3:41 PM | Last Updated on Sun, Jan 21 2024 3:57 PM

Meena Comments On Glamour Roles And Bikini Scenes - Sakshi

మీనా పేరు చెప్పగానే చాలా సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. 90ల్లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. రజనీకాంత్, చిరంజీవి, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. మంచి ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రలు చేస్తోంది. మరోవైపు తమిళంలో ఓ రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజా ఎపిసోడ్‌లో ఈమెకు బోల్డ్ రోల్స్, గ్లామర్ సీన్స్ గురించి ప్రశ్నలు ఎదురవగా.. పలు ఆసక్తికర విషయాల్ని మీనా బయటపెట్టింది.

ఆయన సలహా వల్లే
'నేను నార్మల్ రోల్స్ ఎక్కువగా చేస్తూ వచ్చారు. అలాంటి సమయంలో నా చుట్టూ ఉన్నవాళ్లు గ్లామర్ రోల్స్ ఎందుకు ప్రయత్నించకూడదా అని అడిగారు. మరీ ముఖ్యంగా బోల్డ్ సీన్స్, స్విమ్ సూట్ వేసుకునే పాత్రలు చేయాలని.. కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ ప్రభుదేవా నాకు సలహా ఇచ్చాడు. అయితే కొన్నాళ్లకు అలాంటి ఛాన్స్ వచ్చింది. ప్రభుదేవాతో చేసిన సినిమాలో ఓ సీన్‌లో భాగంగా స్మిమ్మింగ్ డ్రస్ వేసుకున్నాను. కాకపోతే సిగ్గుతో మేకప్ రూమ్ నుంచి బయటకు రాలేకపోయాను'

(ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ)

వాళ్లకు దండం పెట్టాలి
'ఇక స్మిమ్మింగ్ డ్రస్ వేసుకున్న తర్వాత అసలు ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడతానో అని తెగ భయపడిపోయాను. ఏదేమైనా బోల్డ్ పాత్రల్లో నటించడం నిజంగా చాలా కష్టమైన పని. ఇంకా చెప్పాలంటే బోల్డ్ సీన్స్ చేసే హీరోయిన్ల పాదాలకు దండం పెట్టాలని అప్పుడే అనిపించింది' అని తనకెదురైన అనుభవాల్ని తాజాగా ఓ తమిళ షోలో చెప్పుకొచ్చింది.

ఈ మధ్య కాలంలో 'దృశ్యం' సినిమాలతో పాటు పలు మలయాళ సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న పాత్రలు చేస్తోంది. మరోవైపు ఈమె భర్త విద్యాసాగర్.. 2022లో అనారోగ్య సమస్యలతో చనిపోయారు. మీనా కూతురు కూడా 'తెరి' అనే తమిళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement