తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో స్టార్స్. నిజానికి హీరోలు, హీరోయిన్స్, కమెడియన్ ఇలా స్టార్స్ అంతా …టీనేజ్ తర్వాతే సిల్వర్ స్క్రీన్ మీద జర్నీ మొదలుపెడతారు. కానీ…వీరిలో కొందరు మాత్రం బాల్యం నుంచే వెండితెర మీద మెరిసిన వాళ్లు ఉన్నారు. అలాంటి టాలీవుడ్ సెలబ్రిటీస్‌పై స్పెషల్ స్టోరీ..
పసిప్రాయంలోనే తమలోనే నటనాసామర్థ్యాన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించిన వాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. 1979లో నీడ చిత్రంతో బాలనటుడుగా పరిచయం అయ్యా డు. బాలనటుడుగా తొమ్మిది సినిమాల్లో నటించాడు.
బాలనటుడిగా వెండితెర మీద సత్తా చాటిన స్టార్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొకరు. బ్రహ్మ శ్రీ విశ్వామిత్ర హిందీ వెర్షన్లో తొలిసారిగా నటించాడు జూ.ఎన్టీఆర్. ఆ తర్వాత ఎం.ఎస్. రెడ్డి నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రామాయణం చిత్రంలో రాముడుగా అద్భుతమైన నటనని ప్రదర్శించాడు.
ఏడవ ఏటే బాలనటుడిగా..
స్టార్ కమెడియన్ అలీ బాలనటుడుగానే వెండితెర మీద నవ్వులు పూయించాడు. తన ఏడవ ఏట నుంచే నటించడం మొదలుపెట్టాడు అలీ 1979లో సీతాకోకచిలుకతో బాలనటుడుగా పరిచయమైయ్యాడు. తొలి చిత్రం నుంచే హస్యాన్ని పండించడంలో తనదైన ప్రతిభను చాటాడు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్ ఇమేజ్
ఇక బాలనటుడుగానే స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న కొద్ది మందిలో తరుణ్ ఒకడు. మనసు మమత చిత్రంతో బాలనటుడుగా తరుణ్ కెరీర్ మొదలైంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పదికి పైగానే చిత్రాల్లో నటించాడు. బాలనటుడుగా మూడు నంది అవార్డులను అందుకున్నాడు. అంజలి చిత్రానికి జాతీయ అవార్డు కూడా తీసుకున్నాడు.
ప్రహ్లాద పాత్రలో రోజా రమణి
ఇక బాలనటులు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మొదట ప్రస్తావించాల్సిన పేరు రోజా రమణినే. భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రహ్లాద పాత్ర చేసిన రోజా రమణి నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత కథానాయికగా కూడా అనేక చిత్రాల్లో రోజా రమణి నటించారు.
ఆ కొద్దిమందిలో శ్రీదేవి ఒకరు
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో బాలనటిగా నటించి రికార్డు సృష్టించింది శ్రీదేవి. ఆ తర్వాత ఈ భాషా చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా కూడా దశాబ్దాల పాటు తన సత్తా చాటింది. బాలనటిగా పదుల సంఖ్యలో చిత్రాలు చేసింది శ్రీదేవి. దక్షిణాదిన చైల్డ్ ఆర్టిస్ట్‌గానే స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకుంది. భావోద్వేగాలను అద్భుతంగా పలికించే కొద్ది మంది చైల్డ్ ఆర్టిస్టులో ఒకరుగా శ్రీదేవి గుర్తింపు పొందింది. బాలనటిగా హేమాహేమీల్లాంటి స్టార్స్‌తో పోటీ పడుతూ నటించి మెప్పించింది.
శంకరాభరణంతో నంది అవార్డు
చైల్డ్ ఆర్టిస్ట్‌గా,హీరోయిన్‌గా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మరో నటి తులసి. తొలి చిత్రం భార్య. ఆ చిత్రంలో రాజబాబు కుమారుడుగా తులసి నటించింది.అప్పుడు ఆమె వయస్సు ఏడాదిన్నర మాత్రమే. ఆ తర్వాత సీతామహాలక్ష్మి చిత్రంతో అందరి దృష్టిలో పడింది తులసి. ఆ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఆమెదీ ఒకటి. తులసి పైన మూడు పాటలను చిత్రీకరించారు. ఇక శంకరాభరణం చిత్రం గురించి చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలో అద్భుతంగా నటించింది. ఆ సినిమాకి గానూ ఉత్తమ బాలనటిగా నంది అవార్డును కూడా అందుకుంది.
సిరివెన్నెల.. పెద్ద సంచలనమే
బాలనటిగానూ, హీరోయిన్గానూ వెండితెర మీద వెలిగిన స్టార్ మీనా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మీనా తొలి చిత్రం నిన్జనగల్. తమిళంలో రజినీకాంత్, కమలహాసన్ ఇద్దరితోనూ బాలనటిగా నటించింది. హీరోయిన్‌గానూ చేసింది. బాలనటిగా మీనాకు బాగా పేరు తెచ్చిన సినిమా సిరివెన్నెల. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పెద్ద సంచలనమే రేపింది. ఆ చిత్రంలో హీరో సర్వదమన్ బెనర్జీ, మూగ అమ్మాయిగా నటించిన సుహాసి నిలతో పోటీ పడుతూ నటించింది మీనా. అంధ బాలికగా మీనా నటనకి చాలా ప్రశంసలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment