మాట్లాడుతున్న బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు భవాని, మీనా అంతిమ సంస్కారాలు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ కటాఫ్ ఏరియా ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మీనా మృతి చెందలేదని, ఇరు రాష్ట్రాల పోలీసులు కాల్చి చంపారని అమరవీరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు భవానీ, నిరసన నేతలు బషీద్ ఆరోపించారు. మీనాను పోలీసులు ఈ నెల 11వ తేదీన అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసినా లొంగకపోవడంతో 12వ తేదీన కాల్చి చంపారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ప్రాంతంలో అక్రమంగా బాక్సైట్ తవ్వకాలు చేపడుతున్నారన్న నేపథ్యంలోనే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమను మావోయిస్టులు చంపారని అన్నారు. ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఒడిశా పోలీసులు సంయుక్తంగా కొరాపుట్, మల్కన్‌గిరి అడవుల్లో కూంబింగ్ నిర్వహించి, మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా చేసుకుని మీనాని చంపారని తెలిపారు.
303 సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వరంగల్ జిల్లాలోని పొచ్చన్నపేటలో మీనాకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. విప్లవ జోహార్లు తెలుపుతూ అంతిమ సంస్కారాలు జరిపారు. ఈ అంతిమయాత్రలో వరంగల్ పౌరహక్కుల కార్యకర్త రంజిత్, తెలంగాణ రాష్ట్ర ఎస్‌ఎల్‌సీ అధ్యక్షుడు లక్ష్మణ్, మీనా కుటుంబ సభ్యులు సత్యం, భాస్కర్, గాజర్ల రవి, అశోక్, అనిత తదితరులు పాల్గొన్నారు. నలుగురు మావోయిస్టులను కోర్టుకు తరలింపు అలాగే మల్కన్‌గిరి పోలీసుల అదుపులో ఉన్న సుమారు నలుగురు మావోయిస్టులను ఆదివారం కోర్టుకు తరలించినట్టు ఎస్‌పీ జోగ్గా మోహన్ తెలిపారు. వీరిలో జయంతి అలియాస్ అంజన, గ్లోరి, రాధిక, సుమ అలియాస్ గీత, రాజేష్ కోరా ఉన్నట్టు పేర్కొన్నారు.
చదవండి : కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు ఎన్‌కౌంటర్!
Comments
Please login to add a commentAdd a comment