సాక్షి, విశాఖపట్నం : డుంబ్రిగూడా పరిసర ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ పోలీసులు భారీగా మోహరించారు. ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు, సోమల హత్య వెనుక స్థానికులు ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యలో మావోయిస్టులకు సహకరించారన్న అనుమానంతో టీడీపీ మాజీ ఎంపీటీసీ సుబ్బారావు, అతని భార్యను విచారిస్తున్నారు. వీరితో పాటు అంత్రిగూడకు చెందిన కమల, శోభన్ అనే ఇద్దరు గిరిజనులు ఆదివారం అదుపులోని తీసుకుని అప్పటినుంచి విచారిస్తున్నారు.
కిడారి హత్యకు వీరు సహకరించారని పోలీసులు నిర్ధారించుకున్న తరువాత రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. డుంబ్రిగూడకు చెందిన నలుగురు విలేకర్లను కూడా పోలీసులు విచారించి విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో లివిటిపుట్టలో మావోయిస్టులు లేఖ ఇచ్చారన్న విషయంపై పోలీసులు ఆరా తీసున్నారు. కాగా ఒక వైపు సిట్ విచారణ జరుగుతున్నా.. మరోవైపు పోలీసు అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏక్షణం ఏ అధికారిపై వేటు పడుతోందనని ఏజెన్సీలో పనిచేస్తున్న పోలీసులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment