సాక్షి, విశాఖపట్నం, అరకు : అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా కాల్చివేత నేపథ్యంలో అధికారులు స్థానిక డుంబ్రిగుడ ఎస్‌ఐపై వేటు వేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్‌ఐ అమ్మనరావుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా నిన్న జరిగిన కాల్పుల్లో కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమాలు మృతిచెందిన విషయం తెలిసిందే. మావోయిస్టుల చర్యకు నిరసనగా ప్రజాసంఘాలు నేడు ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో అరకులో వాహనాల రాకపోకలు నలిచిపోగా.. దుకాణాలు మూతపడ్డాయి. టీడీపీ నేతల హత్యతో అరకులో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేసి.. భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యకర్తలను, అభిమానులను నిలువరించేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను దింపుతున్నట్లు అధికారులు వెల్లంచారు.
పోస్టుమార్టం పూర్తి...
కిడారి సర్వేశ్వరరావు, సోమాల మృతదేహలకు పోస్టుమార్టం పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించన్నారు. ఈ నేపథ్యంలో భారీగా అదనపు బలగాలను మోహరించారు. అంత్యక్రియల్లో మంత్రులు, ప్రజానిధులు, ఆయన అభిమానులు పాల్గొననున్నారు. మంత్రుల కోసం ప్రత్యేక హెలికాఫ్టర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అంత్యక్రియల నేపథ్యంలో అరకులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తూర్పుకొండల్లో.. మావోగన్స్ ఘాతుకం
మంటలు రేపిన మారణకాండ
భయోత్పాతం.. భీతావహం
Comments
Please login to add a commentAdd a comment