మంచు విష్ణును అభినందించిన మీనా | Meena Comments On Manchu Vishnu | Sakshi
Sakshi News home page

మంచు విష్ణును అభినందించిన మీనా

Published Tue, Jul 30 2024 8:05 AM | Last Updated on Tue, Jul 30 2024 8:34 AM

Meena Comments On Manchu Vishnu

చిత్ర పరిశ్రమకు సంబంధించిన హీరోహీరోయిన్లను విమర్శిస్తూ కొందరు చేసిన, చేస్తున్న వీడియోలతో పాటు కామెంట్లను తొలగించాలంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేయడమే కాకుండా వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. తమ యూట్యూబ్‌ ఛానల్స్‌లలో  ట్రోలింగ్‌ వీడియోలను తొలగించమని హెచ్చరించారు. ఇక నుంచి మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే సహించమని ఫైర్‌ అయ్యారు. దీంతో ఆయనకు నెటిజన్ల నుంచి కూడా మద్ధతు లభించింది.

అభ్యంతరకరమైన కంటెంట్‌తో యూట్యూబ్‌ ఛానల్స్‌ నిర్వహిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు పెట్టేలా మంచు విష్ణు చేశారు. మహిళలపై అసభ్యకర కంటెంట్‌తో రన్‌ చేస్తున్న యూట్యూబ్‌ ఛానల్స్‌ల గుర్తింపును శాశ్వితంగా రద్దు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇలా ఆయన చూపిన దూకుడుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. తాజాగా సినీ నటి మీనా రియాక్ట్‌ అయ్యారు.

అనేక యూట్యూబ్ ఛానెల్‌లలో మహిళలను అవమానించేలా కంటెంట్‌తో నిండిపోయాయి. తప్పుడు కంటెంట్‌ను క్రియేట్‌ చేస్తున్న యూట్యూబ్‌ ఛానళ్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌తో పాటు అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు. చిత్ర పరిశ్రమ సమగ్రతను కాపాడటంలో మీరు తీసుకుంటున్న చర్యలు అభినందనీయంగా ఉన్నాయి. భవిష్యత్‌లో కూడా వీటిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. 

సోషల్‌ మీడియాలో నెగటివ్‌ కామెంట్లను తిప్పకొట్టడంలో నటీనటులు  ఎన్నో ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. ఇండస్ట్రీని కాపాడుకునేందుకు మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. చలనచిత్ర పరిశ్రమ  గౌరవప్రదమైన స్థానంలో ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందే. విష్ణు, మీ చర్యలు నిజంగా అభినందనీయం.  అంటూ మీనా రియాక్ట్‌ అయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement