Meena London Trip: లండన్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్న మీనా | Actress Meena Enjoying Summer Vacation In London, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Meena London Trip: లండన్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్న మీనా

Published Mon, May 13 2024 1:43 PM | Last Updated on Mon, May 13 2024 3:37 PM

Actress Meena At London

తమిళసినిమా: బాలతారగా సినీరంగ ప్రవేశం చేసి స్టార్‌ కథానాయకిగా ఎదిగిన అతి కొద్ది మంది నటీమణిల్లో మీనా ఒకరు. బాల నటిగానే రజనీకాంత్‌తో కలిసి నటించి, ఆ తర్వాత ఆయన సరసన కథానాయకిగా నటించిన చరిత్ర ఈమెది. బహుభాషా నటిగా పేరుగాంచిన మీనా తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో సూపర్‌ స్టార్స్‌ అందరితోనూ జతకట్టారు. 

మలయాళ చిత్రం దృశ్యం వరకు కథానాయకిగా నటించి రాణించిన మీనా ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈమె జీవితంలో ఎదుర్కొన్న విచారకరమైన సంఘటన భర్తను కోల్పోవడం. అనారోగ్యం కారణంగా భర్త చనిపోవడంతో మీనా కొంతకాలం ఆ బాధ నుంచి బయటపడలేకపోయారు. అయితే కాలమే అన్నింటికీ మందు అన్నట్టుగా నటి మీనా మళ్లీ కోలుకుని నటించడానికి సిద్ధమయ్యారు. 

ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న ఈమె తాజాగా నటుడు అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రంలో ముగ్గురు కథానాయకిల్లో ఒకరుగా నటించటానికి సిద్ధమవుతున్నారు. కాగా ప్రస్తుతం ఈమె లండన్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. వేసవి విడిదిగా లండన్‌కు వెళ్లిన నటి మీనా అక్కడ పలు సుందరమైన ప్రదేశాల్లో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తున్నారు. అవి ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. మంచి మోడ్రన్‌ దుస్తుల్లో కనిపిస్తున్న మీనాను చూసి ఆమెను అలా చూసి ఎన్నాళ్లైయిందో అంటూ అభిమానులు కృషి అవుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement