
సినిమా ఇండస్ట్రీలో కొత్త నీరు రాగానే పాత నీరు వెళ్లిపోతుందంటారు. హీరోయిన్లు మారుతుంటారు, కానీ హీరోలు మాత్రం దాదాపు అలాగే ఉండిపోతారు. కానీ కొందరు హీరోయిన్లు వారి క్రేజ్‌ను కాపాడుకుంటూ పరిశ్రమలో ఏళ్లకు ఏళ్లు నిలదొక్కుకుంటారు. అలాంటివారిలో మీనా ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన మీనా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. స్టార్ హీరోలతో ఆడిపాడిన ఈమె ఇప్పటికీ చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది.
కుంగిపోయిన మీనా
కెరీర్ పీక్స్‌లో ఉండగా మీనా 2009లో బెంగళూరుకు చెందిన బిజినెస్‌మెన్ విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరికి నైనిక అనే కూతురు జన్మించింది. అటు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సంతోషంగా సాగిపోతున్న మీనా జీవితం గతేడాది ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. గత సంవత్సరం జూన్‌లో ఆమె భర్త విద్యాసాగర్ మరణించడంతో తీవ్రంగా కుంగిపోయింది. నెమ్మదిగా ఆ బాధ నుంచి కోలుకుని సినిమాలతో బిజీ అవుతున్న తరుణంలో మీనా రెండో పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. కానీ అవి ఉట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి.
అప్పుడు మీనా దగ్గరే ఉన్నా
తాజాగా ఈ వ్యవహారంపై మీనా స్నేహితురాలు కాలా మాస్టర్ స్పందించింది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నాకు మీనాతోనే కాదు, ఆమె కుటుంబంతోనూ మంచి అనుబంధం ఉంది. మేము ఫ్రెండ్స్‌గా కంటే కూడా అక్కాచెల్లెలిగానే ఎక్కువ కలిసిపోయాం. తనకు ఏ అవసరం వచ్చినా వెంటనే నేను అక్కడ వాలిపోతాను. విద్యాసాగర్ ఆరోగ్యం బాలేనప్పుడు మూడు నెలలపాటు నేను తన దగ్గరే ఉన్నాను. కానీ జరగకూడనిది జరిగిపోయింది.
ఆ బాధ నుంచి బయటకు రావడానికి..
తను ఎప్పుడైనా ఉన్నట్లుండి ఫోన్ చేసినా కూడా భయమేసేది. ఆ మూడు నెలలు ముళ్ల మీదే ఉన్నట్లనిపించింది. మీనా భర్త మరణించాక ఆమెను సాధారణ స్థితికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. జీవితం ఇంకా చాలా ఉంది, ఆ బాధ నుంచి బయటకు రావాలని ఏవేవో చెప్పేదాన్ని. తను కూడా నేను చెప్పేది కరెక్టేనని తలూపుతూనే ఈ విషాదం నుంచి బయటకు రావడం ఎంత కష్టంగా ఉందో మాటల్లో చెప్పలేనని బాధపడేది.
పెళ్లి ప్రస్తావన తెస్తే కోప్పడేవారు
తర్వాత నెమ్మదిగా తను ఒప్పుకున్న సినిమాల కోసం సెట్స్‌కు రావడం మొదలుపెట్టింది. అప్పుడు తనతోపాటు నేను కూడా తిరిగి మామూలు మనుషులమయ్యాం. మీనా తల్లి గురించి తలుచుకుంటేనే బాధేసేది. మీనాది మరీ అంత పెద్ద వయసు కాదు కాబట్టి మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పాను. కానీ వాళ్లు నాతో గొడవపడేవారు. ముందు నీ పని నువ్వు చూసుకో లేదంటే సైలెంట్‌గా ఉండు అని నా నోరు మూయించేవాళ్లు. తనకు కూతురు ఉందని, అంతకుమించి ఎటువంటి రిలేషన్స్ కోరుకోవడం లేదని మీనా నాతో అంది' అని చెప్పుకొచ్చింది ఆమె స్నేహితురాలు.
చదవండి: పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా..? .. అనుష్క ఆన్సర్ ఇదే!
Comments
Please login to add a commentAdd a comment