
వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఆడియన్స్‌ని అలరించడానికి స్టార్స్ వెనకాడట్లేదు. చాలామంది స్టార్స్ ఆల్రెడీ వెబ్ మీడియమ్‌కి ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు హీరోయిన్ మీనా కూడా ఓ వెబ్ సిరీస్‌లో ఎంటర్‌టైన్ చేయనున్నారు. తమిళంలో ‘కరోలైన్ కామాక్షి’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇందులో మీనా ముఖ్య పాత్ర చేస్తున్నారు. అండర్ కవర్ ఆపరేషన్ చేసే పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర చేస్తున్నారామె. వివేక్ కుమార్ హర్షన్ రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో జోర్జియా ఆండ్రియానియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవలే ‘కరోలైన్ కామాక్షి’ ప్రారంభం కానుంది. ట్రెండ్ లౌడ్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశేషం ఏంటంటే తమిళంలో మీనా నటించి దాదాపు ఎనిమిదేళ్లు కావస్తోంది. 2011లో నటించిన ‘తంబికోటై్ట’ మీనా యాక్ట్ చేసిన చివరి తమిళ చిత్రం.
Comments
Please login to add a commentAdd a comment