
Actress Meena Is Pregnant Video Goes Viral: ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగువెలిగింది అందాల నటి మీనా. బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె తన అందచందాలతో, చక్కటి అభినయంతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల అరుదైన దుబాయ్ గోల్డెన్ వీసాను కూడా అందుకుంది. అయితే కెరీర్ సరిగా లేని సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త సాగర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఒక పాప నైనిక ఉంది. ఆమె కూడా సినిమాల్లో నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన పోలీసోడు చిత్రంలో అతనికి కూతురుగా యాక్ట్ చేసి మెప్పించింది. కూతురు పుట్టిన తర్వాత కొంతకాలం వరకు సినిమాలు చేయలేదు మీనా.
ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీనా.. తల్లి, సోదరి తదితర పాత్రలతో అలరిస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మీనా ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా మీనా పోస్ట్ చేసినా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీనా గర్భవతిగా కనిపిస్తుంది. 'చాలా మారిపోయింది. అప్పట్లో ఈ గెటప్ వేయడం చాలా సులభంగా ఉండేది. దీన్ని కవర్ చేసేందుకు హెవీ చీరలు కట్టుకునేదాన్ని. కానీ ప్రస్తుతం ఈ గెటప్‌కు, ఈ పాత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. షిఫాన్ చీరలు కట్టుకున్నా చూడటానికి చాలా నాచురల్‌గా ఉంది.' అంటూ వీడియోకు క్యాప్షన్‌గా రాసుకొచ్చింది.
చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్
ఈ పోస్ట్‌ను బట్టి చూస్తే మీనా ఓ సనిమాలో గర్భవతిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే మీనా ఈ వీడియోను షేర్ చేసినట్లు సమాచారం. ఈ పోస్ట్‌పై చాలా మంది నెటిజన్లు 'కంగ్రాట్స్' అని, మరికొందరు 'కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్' అని కామెంట్స్ పెడుతున్నారు.
చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్
Comments
Please login to add a commentAdd a comment