Actress Meena reveals that she had a crush with Hrithik Roshan - Sakshi
Sakshi News home page

Meena: ఆ హీరోని చాలా ప్రేమించా.. పెళ్లి విషయం తెలిసి బాధపడ్డా: మీనా

Published Tue, Mar 14 2023 10:40 AM | Last Updated on Tue, Mar 14 2023 11:46 AM

Actress Meena Reveals That She Had Crush With Hrithik Roshan - Sakshi

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన నటి మీనా. దాదాపు మూడు దశాబ్దాలుగా స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది.  కమలహాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌,  నాగార్జున వంటి స్టార్‌ హీరోలందరితో కలిసి నటించింది. కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా నైనికా అనే పాప జన్మించింది.

గతేడాది జూన్‌లో ఆమె భర్త మృతి చెందిన సంగతి తెలిసిందే. భర్తను కోల్పోయిన దుఃఖం నుంచి ఈమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తూ.. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. 

ఇదిలా ఉంటే మీనా ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా ఓ తమిళ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.  పెళ్లికి ముందు తనకు ఓ బాలీవుడ్‌ హీరో అంటే క్రష్‌ ఉండేదని, అలాంటి వ్యక్తినే వివాహం చేసుకుంటానని అమ్మతో చెప్పానని మీనా అన్నారు. మీనా మనసు పడ్డ హీరో ఎవరో కాదు...  బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్ రోషన్.

హృతిక్‌పై తనకు ఉన్న ప్రేమ గురించి చెబుతూ.. ‘హృతిక్ రోషన్‌ను చాలా ప్రేమించాను. నాకు హృతిక్ లాంటి అబ్బాయి కావాలి అని పెళ్లి ప్రపోజ్ చేస్తున్న మా అమ్మతో చెప్పాను. హృతిక్ పెళ్లి రోజు నా గుండె పగిలింది. అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు’ అని మీనా చెప్పుకొచ్చింది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement