Actress Meena Ready To Get Married Once Again Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

Meena Second Marriage Rumours: రెండో పెళ్లికి సిద్ధమవుతున్న సీనియర్ నటి.. అందులో నిజమెంత?

Published Mon, Nov 28 2022 7:03 PM | Last Updated on Mon, Nov 28 2022 7:30 PM

Actress Meena Ready To Get Married Once Again Goes Viral - Sakshi

సీనియర్ నటి మీనా గురించి టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేదు. దక్షిణాది సినిమాల్లో కథానాయికగా రాణించారు. తెలుగు, తమిళం తదితర భాషల్లో కమలహాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి సూపర్‌స్టార్స్‌తో జత కట్టారు. కొద్ది నెలల క్రితమే మీనా జీవితంలో భర్తను కోల్పోయిన విషయం తెలిసిందే.

(చదవండి: అలా అయితే నా భర్త బతికేవాడు.. జీవితం ఇంకోలా ఉండేది: మీనా ఎమోషనల్‌)

అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రెండో పెళ్లికి సిద్ధమైందంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆమె భర్తను కోల్పోయిన విషాదం నుంచి కోలుకుంటున్నారు. మెల్లమెల్లగా ఆమె తన ప్రొఫెషన్‌లో యాక్టివ్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు రెండో పెళ్లి చేసుకోవాలని ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఆమెకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కూతురికి కోసమైనా రెండో పెళ్లి చేసుకోమ్మని కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారని టాక్. మరీ ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. మరోవైపు కూతురి భవిష్యత్తు దృష్ట్యా ఫ్యామిలీ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement