![Actress Meena Decided To Donate Her Organs After Her Husband Demise - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/14/meena.jpg.webp?itok=uiHFgWSy)
ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. భర్త మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న మీనా.. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారు. ఇటీవల సినిమా షూటింగ్స్‌కి కూడా హాజరయ్యారు. పలువురు బంధువులు, స్నేహితులు తరుచూ కలుస్తుండడంతో మీనా మళ్లీ యాక్టివ్ అయ్యారు. అంతేకాదు తాజాగా ఆమె గోప్ప నిర్ణయం తీసుకున్నారు. తన తదనంతరం అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించి, అందరిచే శభాష్ అనిపించుకున్నారు. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే(ఆగస్ట్ 13) సందర్భంగా తాను ఆర్గాన్ డొనేట్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని, మీరు కూడా గొప్ప నిర్ణయాన్ని తీసుకోండి అని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
(చదవండి: 'జబర్దస్త్' మానేయడంపై తొలిసారి నోరువిప్పిన అనసూయ)
‘ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని ఇంకోటి ఉండదు. అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఒకరికి అవయవాలు దానం చేయడం వల్ల వారి కుటుంబంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో నేను కళ్లారా చూశాను. మా సాగర్‌కు(మీనా భర్త) ఇంకా అలాంటి దాతలు దొరికి ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది. ఒక దాత 8 మంది ప్రాణాలను కాపాడొచ్చు.
అవయవ దానం గొప్పదనం గురించి ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అవయవ దానం అనేది కేవలం డాక్టర్లు, పేషెంట్ల మధ్య సంబంధం కాదు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అందరికీ సంబంధించింది. నేను నా ఆర్గాన్స్‌ను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నాను’అంటూ ఎమోషనల్ పోస్ని ఇన్‌స్టాలో షేర్ చేసింది. మీనా నిర్ణయం వెనుక ఆమె భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. మీనా భర్తకు ఊపిరితిత్తులు మారిస్తే బ్రతికేవాడు. కానీ సమయానికి దాతలు దొరక్కపోవడంతో ఆయన మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment