
చట్ట వ్యతిరేక పనులు చేసినా మనల్ని ఎవరు పట్టుకుంటారులే అనే ఆలోచన ఉంటే అక్కడే ఆగిపోండి. ఎందుకంటే కామాక్షి మీ ప్రతీ కదలికను గమనిస్తూనే ఉంటుంది. ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఆమె కామాక్షి.. కరోలిన్ కామాక్షి... సీబీఐ ఆఫీసర్. మీనా ముఖ్య పాత్రలో రూపొందుతున్న వెబ్ సిరీస్ ‘కరోలిన్ కామాక్షి’. వివేక్ కుమార్ కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే మీనా తొలి వెబ్ సిరీస్. ఇందులో సీబీఐ పాత్రలో కనిపిస్తారామె. ఈ సిరీస్ ఫస్ట్ లుక్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియాని మరో కథానాయిక.గా నటిస్తున్నారు. అండర్ కవర్ పోలీస్ పాత్రలో ఆండ్రియాని కనిపిస్తారు. జీ5లో ఈ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment