సినిమా: మగ మిత్రులు తనతో సరదాగా మాట్లాడడానికే భయపడుతున్నారని నటి పూర్ణ అంటోంది. ఈ మలయాళీ భామ మాత్రభాషతో పాటు తెలుగు, తమిళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం నాలుగు చిత్రాలు చేతిలో ఉన్నాయి. అయితే కథానాయకి పాత్రల్లోనే నటిస్తానని బెట్టు చేయకుండా పాత్రకు ప్రాధాన్యత ఉంటే నటించడానికి సిద్దం అనడంతో కాళీ లేకుండా నటించేస్తోంది. ప్రస్తుతం విమల్ హీరోగా నటిస్తున్న ఇవనుక్కు ఎంగేయో మచ్చమ్ ఇరుక్కు చిత్రంలో పోలీస్‌అధికారిణిగా మాస్ పాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా పలు విషయాలను ముచ్చటించింది. అవేమిటో చూద్దాం. ఇవనుక్కు ఎంగేయో మచ్చమ్ ఇరుక్కు చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాను. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ కథా చిత్రం. ఇందులో రౌడీ పోలీస్‌అధికారిణిగా కనిపిస్తాను. హీరో విమల్‌ను, సింగంపులిని తరిమి తరిమి కొట్టడమే నా పని. అలాంటి సన్నివేశాల్లో చాలాసార్లు వారిని నిజంగానే కొట్టేశాను. దీంతో పాటు బ్లూవేల్ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంలో తొలి సారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. అందులో ఒకటి పోలీస్ పాత్ర కావడం విశేషం. అయితే ఆ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది.
అదేవిధంగా మమ్ముట్టితో కలిసి మధురవీరన్ చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే ఒక తెలుగు చిత్రం చేస్తున్నాను. అందులో నటి జయప్రదకు తల్లిగా, కూతురిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. నాతో పాటు నటించడానికి వచ్చిన సహ నటీమణులు ఇప్పుడు ఫీల్డ్‌లో లేరు. నేను ఇంకా నటిగా కొనసాగడం సంతోషంగా ఉంది. ఇందుకు కారణం తమిళ ప్రేక్షకుల ఆదరణే. నటనకు అవకాశం ఉన్న పాత్రలే నన్ను వెతుకుంటూ వస్తున్నాయి. ఆ విధంగా సంతోషమే. ఇకపోతే నా శరీరాకృతికి గ్లామర్ సెట్ అవ్వదు. అదేవిధంగా ఇలానే నటించాలన్న నిబంధనలేమీ లేవు. నేనొక క్లాసికల్ డాన్సర్‌ని. చాలా స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చాను. ఇవనుక్కు ఎంగేయో మచ్చమ్ ఇరుక్కు చిత్రం కోసం గుండు కొట్టించుకోవడాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే ఈ విషయంలో స్వామికి జుత్తు సమర్పించినట్లుగా నేను భావిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే నాకు బాయ్ కట్ హెయిర్‌స్టైల్‌లో చూసుకోవాలన్నది చాలా కాలంగా ఉన్న కోరిక. గుండు కొట్టించుకోవడంతోనే అది సాధ్యం అయ్యింది. ఇప్పుడు మీటూ కలకలం సృష్టిస్తోంది. అయితే మీటూ వ్యవహారానికి నేను మద్దతు పలకను. ఎందుకంటే ఏదైనా ఒక విషయం జరిగితే వెంటనే రియాక్ట్ కావాలి. అంతే కానీ, నెల తరువాత స్పందిస్తే వృథానే. అదే విధంగా మీటూ కారణంగా నా సన్నిహిత మగ మిత్రులు కూడా సరదాగా మాట్లాడడానికి భయపడుతున్నారు. షూటింగ్ స్పాట్‌లో జాలీగా మాట్లాడుకునే కాలం కొండెక్కింది. ఇది మనల్ని మనమే అసహ్యించుకునే చర్యగా భావిస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment