'సుల్తాన్' ఇంటికి ధోని దంపతులు | Mahendra Singh Dhoni Met Salman Khan at His Bandra Home | Sakshi
Sakshi News home page

'సుల్తాన్' ఇంటికి ధోని దంపతులు

Published Wed, Apr 13 2016 1:32 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

'సుల్తాన్' ఇంటికి ధోని దంపతులు - Sakshi

'సుల్తాన్' ఇంటికి ధోని దంపతులు

ముంబై: టీమిండియా కెప్టెన్లు బాలీవుడ్ 'సుల్తాన్' ఇంటిబాట పట్టారు. గతవారం టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి సల్మాన్ ఖాన్ ఇంటికి డిన్నర్ చేశారు. తాజాగా టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ ఎంఎస్ ధోని సతీసమేతంగా సల్మాన్ ఇంటికి వెళ్లాడు. ఐపీఎల్ కోసం ముంబై వచ్చిన 'మిస్టర్ కూల్' సోమవారం రాత్రి తన భార్య సాక్షి, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కుమార్తె పూర్ణతో కలిసి సల్లూభాయ్ నివాసంలో పార్టీకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా సల్మాన్ మేనల్లుడికి ధోని, సాక్షి గిఫ్ట్ లు ఇచ్చినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ బర్త్ డే పార్టీలో కలుసుకున్నప్పుడు ధోని దంపతులను సల్మాన్ తన ఇంటికి రావాలని ఆహ్వానించాడని తెలిపాయి. సల్మాన్ నివాసంలో డిన్నర్ ముగిసిన తర్వాత తన తాజా చిత్రం 'సుల్తాన్' టీజర్ ను ధోని దంపతులకు చూపించాడని వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement