ఐపీఎస్ అధికారి కావడమే లక్ష్యం | i want to become as IPS offcier, says Anand kumar | Sakshi
Sakshi News home page

ఐపీఎస్ అధికారి కావడమే లక్ష్యం

Published Sun, Jun 8 2014 4:03 PM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM

ఐపీఎస్ అధికారి కావడమే లక్ష్యం

ఐపీఎస్ అధికారి కావడమే లక్ష్యం

హైదరాబాద్: ఐపీఎస్ అధికారి కావడమే తన లక్ష్యమని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగుతేజం ఆనంద్ కుమార్ చెప్పాడు. చిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించి రికార్డు సృష్టించిన తెలుగుతేజాలు పూర్ణ, ఆనంద్ కుమార్ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ తిరిగివచ్చారు.

శంషాబాద్ విమానాశ్రయంలో వీరికి ఘనస్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టు నుంచి గుర్రపు బగ్గీలో ర్యాలీగా నగరానికి తీసుకువచ్చారు. తాము ఎవరెస్టు శిఖరం ఎక్కడానికి ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమారే స్ఫూర్తి అని పూర్ణ, ఆనంద్ చెప్పారు. తమకు సాయం చేసిన గురువులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భారతీయులైనందుకు గర్వపడుతున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement