Dasara Movie Actress Shamna Kasim Alias Poorna Blessed with Baby Boy - Sakshi
Sakshi News home page

Poorna: మగబిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ.. పోస్ట్ వైరల్

Apr 4 2023 4:15 PM | Updated on Apr 4 2023 4:23 PM

Dasara Actress Poorna Shamna Kasim Blessed With Baby Boy - Sakshi

సీమటపాకాయ్‌ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ. రవిబాబు డైరెక్షన్‌లో వచ్చిన అవును సినిమాతో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న పూర్ణ ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాలతో మెప్పించింది. అయితే హీరోయిన్‌గా కంటే బుల్లితెరపైనే ఎక్కువగా పాపులర్‌ అయిన పూర్ణ దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే గర్భం ధరించినట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఎ‍ప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలే నాని, కీర్తి సురేశ్ నటించిన దసరా సినిమాలోనూ కనిపించింది.

తాజాగా ఆమెకు మగబిడ్డ జన్మించినట్లు పూర్ణ వెల్లడించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఫోటోలు పంచుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆస్పత్రికి సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఫోటోలు షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు పూర్ణకు అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. గతంలో ఆమె గర్భం ధరించినప్పటి నుంచి సీమంతం వరకు ప్రతి సందర్భంలోనూ తన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement