టాలీవుడ్‌లో నిఖిల్ హీరోగా నటించిన 'స్వామి రారా' నటి పూజా రామచంద్రన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త జాన్ కొక్కెన్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. బాబు వేలిని పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. అప్పుడే తమ బిడ్డకు కియాన్ కొక్కెన్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.
(ఇది చదవండి: అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం మీటర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..)
తమిళంలో బిగ్ బాస్ ద్వారా పూజాకు ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత కాంచన-2, దోచేయ్, త్రిపుర, దళం, వెంకీమామ, పవర్ ప్లే లాంటి సినిమాల్లో నటించారు. మరో వైపు ఆమె భర్త జాన్ కొక‍్కెన్ విలన్‌గా పలు చిత్రాల్లో మెప్పించారు. ముఖ్యంగా కేజీఎఫ్, కబ్జా, వీరసింహారెడ్డి, తెగింపు లాంటి విలన్‌గా నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment