
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెరపై కూడా అదరగొడుతుంది కేరళ భామ పూర్ణ. సీమ టపాకాయ్,అవును, అఖండ, దృశ్యం-2 చిత్రాల్లో నటించిన పూర్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతుంది. హీరోయిన్‌గా కంటే బుల్లితెరపై ఓ షోకు జడ్జిగా వ్యవహరించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే పూర్ణ ఈమధ్యే తనకు పెళ్లయిపోయిందని చెప్పి పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో మే నెల 31 నిశ్చితార్థం జరగ్గా జూన్ 12వ తేదీన దుబాయ్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో తన వివాహం జరిగిందని స్వయంగా పూర్ణ రివీల్ చేసింది.
తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా కాసేపట్లో ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతో పూర్ణ దంపతులకు పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment