అభిమాని పెళ్లిలో స్టార్‌ హీరో సందడి.. ఫోటోలు వైరల్‌ | Vijay Sethupathi Attend His Fans Marriage | Sakshi
Sakshi News home page

అభిమాని పెళ్లిలో స్టార్‌ హీరో సందడి.. ఫోటోలు వైరల్‌

Published Fri, May 31 2024 1:07 PM | Last Updated on Fri, May 31 2024 1:17 PM

Vijay Sethupathi Attend His Fans Marriage

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆయన హీరో మాత్రమే కాదు అందరినీ మెప్పించే విలన్‌ కూడా.. టాలీవుడ్,కోలీవుడ్‌లో తన నటనతో ఫ్యాన్స్ను సొంతం చేసుకున్నారు. ఆయనకు పాత్ర నచ్చితే చాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తాడు. అందుకే విజయ్ సేతుపతికి ఇండస్ట్రీతో సంబంధం లేకుండా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకు మలేషియాలో కూడా మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది.

తాజాగా విజయ్‌ సేతుపతి తన అభిమాని పెళ్లికి హాజరయ్యాడు. ఆయన రాకతో పెళ్లికి వచ్చిన అతిథిలు అందరూ ఆశ్చర్యపోయారు.  మదురై జిల్లా ఉసిలంబట్టి మున్సిపాలిటీ పరిధిలోని కీజాపుదూర్‌కు చెందిన జయబాస్,జయపాల్ ఇద్దరూ విజయ్‌ సేతుపతికి అభిమానులు. అంతేకాకుండా విజయ్ సేతుపతి జిల్లా అభిమాని సంఘానికి అధ్యక్షుడిగా ఒకరు ఉంటే మరోకరు జిల్లా ఉప కార్యదర్శిగా ఉన్నారు. 

ఈ అన్నదమ్ములు మే 2న తమకు నచ్చిన యువతులను పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే, విజయ్‌ సేతుపతికి 2వ తేదీలో సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ ఉండటంతో నేడు వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో ఆయన ఒక బాలుడిని ఎత్తుకుని ఫోటో దిగడం విశేషం. అనంతరం మెట్టుపాళయంలో షూటింగ్‌కు బయలుదేరారు.

 విజయ్ సేతుపతి నటించిన కొత్త సినిమా మహారాజ ట్రైలర్ తాజాగా విడుదలైంది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. నిథిలన్ సామినాథన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement