Actress Poorna Back Door Movie Gets Amazing Response In OTT, Deets Inside - Sakshi
Sakshi News home page

Actress Poorna: ఓటీటీలో ఆకట్టుకుంటోన్న పూర్ణ 'బ్యాక్ డోర్‌' మూవీ

May 29 2023 11:53 AM | Updated on May 29 2023 12:33 PM

Actress Poorna Back Door Gets Amazing Response In Ott - Sakshi

ఓటీటీలో కంటెంట్ ఓరియెంటెడ్, డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కే చిత్రాలకు, బోల్డ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. హీరోయిన్ పూర్ణ నటించిన బ్యాక్ డోర్ సినిమా గత ఏడాది థియేటర్లోకి వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసిస సంగతి తెలిసిందే.  అమెజాన్‌ ప్రైమ్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగామెప్పిస్తోంది. 

ఆర్చిడ్ ఫిల్మ్ స్టూడియోస్ బ్యానర్ మీద బి శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కర్రి బాలాజీ దర్శకత్వం వహించారు.ఇక ఈ చిత్రంలో పూర్ణ సరసన కొత్త హీరో తేజ నటించారు. రెండే రెండు పాత్రలతో, ఆడవాళ్ళ మనోభావాల్ని, కుటుంబ విలువల్ని, భార్యాభర్తల సంబంధాల్ని, అక్రమ సంబంధాలు వల్ల వచ్చే నష్టాన్ని ఈ చిత్రంలో చూపించారు. చదవండి: రానాతో నెక్ట్స్‌ మూవీని అనౌన్స్‌ చేసిన డైరెక్టర్‌ తేజ

రెండు గంటల నిడివి ఉండే ఈ చిత్రంలో రెండే పాత్రలతో సినిమాను నడిపించారు. మెయిన్‌ లీడ్‌గా పూర్ణ నటించగా, ఆమెకు జోడీగా తేజ డెబ్యూతో ఆకట్టుకున్నాడు. సంగీతం బాగుంది. ఎడిటింగ్ చోట కే ప్రసాద్ తన మార్కుని చూపించారు. ఇలా బ్యాక్ డోర్ సినిమా ఇప్పుడు అన్ని రకాలుగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement