
హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీమటపాకాయ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది మలయాళ ముద్దుగుమ్మ. అవును సినిమాతో మరింత క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాల్లోనూ కనిపించింది. కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలోనే గతేడాది దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: ఘనంగా హీరోయిన్ పూర్ణ సీమంతం.. ఫోటోలు వైరల్)
ఆ తర్వాత హీరోయిన్ గర్భం దాల్చినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా నటి బేబీ బంప్ ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. నా జీవితంలో ఇదే పెద్ద గిఫ్ట్ ఇదేనంటూ ఆమె బేబీ బంప్‌తో ఉన్న చిత్రాలు పంచుకున్నారు. ఇటీవలే పూర్ణ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు.ఈ ఫోటోలను స్వయంగా పూర్ణ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాజాగా బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment