పొన్నియిన్ సెల్వన్, అమ్ము సినిమాలతో ఫేమ్ సంపాదించుకున్న మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి. మణిరత్నం సినిమాతో ఒక్కసారిగా ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఆమె చిన్నతనంలో జరిగిన ఓ సంఘటనపై ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. గుడికి వెళ్లినప్పుడు ఓ యువకుడు తన ప్రైవేట్ పార్ట్స్ తాకినట్లు ఆమె వెల్లడించింది. అంతేకాకుండా దురుసుగా ప్రవర్తించాడని వివరించింది.
ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. 'నా చిన్నతనంలో కేరళలోని గురువాయూర్ ఆలయానికి వెళ్లాం. అక్కడ ఓ యువకుడు నా ప్రైవేట్ భాగాలను తాకి దురుసుగా ప్రవర్తించాడు. ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది. ఎందుకంటే ఆరోజు నేను పసుపు బట్టలు వేసుకుని ఉన్నా. అప్పటి నుంచి పసుపు బట్టలు వేసుకోవాలంటేనే భయంగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి భయం లేదు' అంటూ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంది. ఇటీవలే ఐశ్వర్య లక్ష్మి నటించిన మట్టి కుస్తీ థియేటర్లలో సందడి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment