
హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీమటపాకాయ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ మలయాళ ముద్దుగుమ్మ అవును సినిమాతో మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాల్లో నటించింది. కెరీర్‌లో బిజిగా ఉన్న సమయంలోనే గతేడాది దుబాయ్‌కి చెందిన బిజినెస్ మేన్ ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఇటీవలె త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు చెప్పి గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా పూర్ణ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా పూర్ణ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోవడంతో పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment