గుడ్‌న్యూస్‌ చెప్పిన టాలీవుడ్‌ హీరోయిన్‌ | Bigg Boss Sana Khan Announces Second Pregnancy With Husband Anas Saiyad, Shares Video Goes Viral | Sakshi
Sakshi News home page

Sana Khan: గుడ్‌న్యూస్‌ చెప్పిన 'కత్తి' హీరోయిన్‌

Nov 22 2024 8:27 PM | Updated on Nov 23 2024 12:19 PM

Sana Khan Announces Second Pregnancy, Shares Video

కత్తి, గగనం, మిస్టర్‌ నూకయ్య వంటి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితమైన హీరోయిన్‌ సనా ఖాన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. ముగ్గురం నలుగురం కాబోతున్నామని పేర్కొంది. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారగా అభిమానులు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సినీ కెరీర్‌
కాగా హీరోయిన్‌ సనా ఖాన్‌.. 2005లో యేహై హై సొసైటీ అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కళ్యాణ్‌రామ్‌ కత్తి మూవీతో తెలుగులో అరంగేట్రం చేసింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. 2019లో తమిళ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసింది. తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. 

మధ్యలో హిందీ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. సినిమాలు మానేసిన తర్వాత నవంబర్ 2020 నవంబరులో ముస్లిం మతగురువు, వ్యాపారవేత్త అనాస్ సయ్యద్‌ని పెళ్లి చేసుకుంది. వీరికి 2023లో పాపాయి జన్మించింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement