Bigg Boss Shiva Jyothi Gives Clarity On Pregnancy Rumours, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Shiva Jyothi : వ్యూస్‌ కోసం అలాంటి వీడియోలు పెట్టకండి.. శివజోతి ఆవేదన

Published Tue, Apr 19 2022 1:34 PM | Last Updated on Tue, Apr 19 2022 2:24 PM

Bigg Boss Fame Shiva Jyothi Clarity On Pregnancy - Sakshi

యాంకర్‌ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు సంపాదించుకున్న శివజ్యోతి బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులర్‌ అయ్యింది. బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొని టాప్‌ 6 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. షో తర్వాత వరుస అవకాశాలతో ఫుల్‌ బిజీగా మారిన శివజ్యోతి తన యూట్యూబ్‌ చానల్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్‌ చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో శివజ్యోతి స్పందించింది.

ఈ సందర్బంగా ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'నా గురించి నాకు తెలియకుండానే వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌కి వెళుతూ మామిడి కాయతో ఫోటో పెట్టా. ఇక అంతే.. అప్పటి నుంచి నేను ప్రెగ్నెంట్‌ అంటూ ఫేక్‌న్యూస్‌ సృష్టిస్తున్నారు. వ్యూస్‌ కోసం కక్కుర్తి పడి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్‌ వేస్తున్నారు.  పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా నాపై చాలా ఎఫెక్ట్‌ చూపిస్తుంది.  అవును మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యింది. మా పిల్లల కోసం మా ఫ్యామిలీ అంతా ఎంతో ఎదురుచూస్తుంది. నేను కూడా వెయిట్‌ చేస్తున్నా.

ఇది ఎమోషనల్‌గా ఎంత బాధపెడుతుందో మీకు చెప్పలేను. నేను ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు వస్తుండటంతో కొన్ని ఈవెంట్స్‌ చేయనేమో అని అనుకుంటున్నారు. అలా నా వర్క్‌ని కూడా దెబ్బతీస్తున్నారు. ఇందులో నా ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీని కూడా ఇన్‌వాల్వ్‌ చేస్తున్నారు. అందుకే ఇలా వీడియో చేస్తున్నా. ప్లీజ్‌.. ప్రెగ్నెన్సీ అన్నది నా జీవితంలో చాలా పెద్ద విషయం. కాబట్టి నిజంగా నా లైఫ్‌లో ఆ గుడ్‌న్యూస్‌ ఉంటే నేనే మీ అందరితో షేర్‌ చేస్తాను. అప్పటివరకు ఇలా ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేయకండి' అంటూ చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement