
హీరోయిన్ పూర్ణ అటు వెండితెరతో పాటు ఇటు బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ భామ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను కొనసాగిస్తుంది. సోషల్ మీడియాలోనూ వరుస ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. ఇక ఇటీవలె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన పూర్ణ తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది.
తాను త్వరలోనే తల్లి కాబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 12న దుబాయ్‌లో వ్యాపారవేత్త ఆసిఫ్ అలీతో పూర్ణ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలో పూర్ణ పెళ్లి ఘనంగా జరిగింది. తాజాగా తాను తల్లికాబోతున్నట్లు వెల్లడించడంతో పూర్ణ దంపతులకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment