Allu Arjun Comments On Movie With Priyamani In Dance Show, Goes Viral- Sakshi
Sakshi News home page

Allua Arjun-Priyamani: ప్రియమణిపై ‘హాట్‌’ కామెంట్స్‌ చేసిన బన్నీ

Published Fri, Dec 3 2021 8:52 PM | Last Updated on Sat, Dec 4 2021 8:10 AM

Allu Arjun Shocking Comments On Priyamani In a Dance Show - Sakshi

Allu Arjun Shocking Comments On Actress Priyamani: ప్రియమణిపై ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఇటీవల ప్రముఖ డ్యాన్స్‌ షోకు అతిథిగా వచ్చిన బన్నీ ఆ షో జడ్జిలో ఒకరైన ప్రియమణిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈ షో హోస్ట్‌ ప్రదీప్‌ అల్లు అర్జున్‌తో ప్రియమణి, పూర్ణలను చూపిస్తూ ఈ బ్యూటిఫుల్‌ లేడి జడ్జిలకు ఓ స్సెషాలిటీ ఉంది సార్ అనగానే.. ఏంటది అంటాడు బన్నీ.

చదవండి: రాజ‘శేఖర్‌’ మూవీకి ఓటీటీ షాకింగ్‌ రేట్స్‌!

వెంటనే ప్రదీప్ డాన్స్ బాగా చేసిన వాళ్ళకు ప్రియమణి గారు హగ్ ఇస్తారని, అదే పూర్ణ గారైతే డాన్స్ బాగా చేస్తే బుగ్గ కోరుకుతారనగానే అల్లు అర్జున్.. ఇంకా బాగా చేస్తే ఇంకేం చేస్తారో అంటూ తనదైన శైలిలో కామెంట్‌ చేశాడు. అలా పూర్ణపై బన్నీ టక్కున కౌంటర్‌ వేయగానే షోలో ఒక్కసారిగా నవ్వులు పండాయి. ఆ తర్వాత బన్నీతో ప్రియమణి మీతో వర్క్ చేయలేదని నాకు చాలా బాధగా ఉంది బన్నీ అనగానే మీరు అసలు అలా అనుకోవదని, ఇప్పటికీ ఇంకా చాన్స్‌ ఉందన్నాడు. 

చదవండి: అన్నయ్యను ఇలా పరిచయం చేస్తాననుకోలేదు: హీరో ఆవేదన

మీతో ఎప్పుడైనా వర్క్‌ చేస్తానని, పైగా ఇప్పుడు ఇంకా సన్నబడి హాట్‌గా తయారయ్యారంటూ బన్నీ అనడంతో ప్రియమణితో సహా అక్కడి వారంతా నోళ్లు వెళ్లబెడతారు.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రియమణిపై సరదాగా అల్లు అర్జున్‌ చేసిన ఈ కామెంట్స్‌ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. కాగా బన్నీ పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ ప్రమోషన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవల సమంతతో స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడాడు. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్‌ విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ ట్రైలర్‌ ట్రీజ్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఇక పుష్ప దీ రైజ్‌ పార్ట్‌ 1 డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement